ETV Bharat / sitara

విడుదలకు సిద్ధమైన కార్తికేయ తొలి చిత్రం - కార్తికేయ తొలి చిత్రం ఫైనల్ సెటిల్​మెంట్ రిలీజ్ ఖరారు

కార్తికేయ నటించిన మొదటి చిత్రం 'ఫైనల్ సెటిల్​మెంట్' అనివార్య కారణాల వల్ల ఇప్పటివరకు రిలీజ్​కు నోచుకోలేదు. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Karthikeya first movie Final Settlement
కార్తికేయ
author img

By

Published : Apr 27, 2021, 6:08 PM IST

'ప్రేమతో మీ కార్తీక్‌' చిత్రంతో నటుడిగా పరిచయమై, 'ఆర్‌ఎక్స్‌ 100'తో సంచలనం సృష్టించాడు కార్తికేయ. వీటి కంటే ముందే 'ఫైనల్‌ సెటిల్‌మెంట్' అనే చిత్రంలో నటించాడు. అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని స్వీయ నిర్మాణంలో జమ్మలమడుగు మోహన్ కాంత్ తెరకెక్కించారు.

Karthikeya first movie Final Settlement
ఫైనల్ సెటిల్​మెంట్

హైదరాబాద్‌- వరంగల్‌ నగరాలకు చెందిన రెండు బృందాలు ఓ అనాథాశ్రమాన్ని దోచుకునే ప్రయత్నంలో వాళ్ల మధ్య ఏం జరిగిందనే ఆసక్తికర అంశాలతో రూపొందిందీ చిత్రం. ‘కార్తికేయ అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో అతనిలోని నటుడ్ని గుర్తించి ఈ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రని ఇచ్చినట్టు’ తెలిపారు దర్శక-నిర్మాత మోహన్‌ కాంత్‌. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.బి., కూర్పు: పవన్ మంగాల, ఛాయాగ్రహణం: జయంత్.

పోసాని కృష్ణ మురళి, ఆర్తి అగర్వాల్‌ ప్రధాన పాత్రధారులుగా 'ఆపరేషన్‌ ఐపీఎస్‌' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడే మోహన్‌కాంత్‌.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.