ETV Bharat / sitara

ఐకానిక్​ పాత్రలు కోల్పోయిన అగ్రనటులు వీరే! - kangana ranaut latest news updates

మన అభిమాన తారలు నటించిన కొన్ని పాత్రలు ఎప్పటికీ మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఆ పాత్రలే కళ్ల ముందు మెదులుతుంటాయి. అయితే, అలా వచ్చిన ఐకానిక్​ రోల్స్​ ఆఫర్స్​ను కోల్పోయిన బాలీవుడ్​ టాప్-5 అగ్ర నటుల గురించి ప్రత్యేక కథనం మీకోసం.

Kareena Kapoor Khan To Kangana Ranaut: Top Actors Who Lost Iconic Roles In Bollywood Films
బాలీవుడ్​
author img

By

Published : Jul 20, 2020, 10:11 AM IST

బాలీవుడ్​లో చాలా మంది తారలు తమ స్థాయి , స్క్రీన్ టైమింగ్​ను దృష్టిలో పెట్టుకుని పాత్రలు ఎంచుకుంటుంటారు. ఇక దర్శకుల విషయానికొస్తే.. కథ రాసుకునే సమయంలోనే ఒక నిర్దిష్ట హీరో, హీరోయిన్​లను ఊహించుకుంటారు. వారే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతారని నిర్ణయించుకుంటారు. అయితే, స్టార్​లు ఆ పాత్రను తిరస్కరించినప్పుడు.. మరొక నటుడిని ఆ అవకాశం వరిస్తుంది. అటువంటి పాత్రలు కొన్నిసార్లు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇలా కొంత మంది నటీనటులు ఆ పాత్రలను కోల్పోయినందుకు చింతిస్తున్నట్లు చెబితే.. ఇంకొందరు వేరొకరికి స్టార్​డమ్​ ఇచ్చామని చెబుతుంటారు. ఏదేమైనా తమ కోసం వెతుక్కుంటూ వచ్చిన కొన్ని ఐకానిక్​ పాత్రలను తిరస్కరించిన బాలీవుడ్​ టాప్​-5 నటులపై ఓ లుక్కేద్దాం రండి.

'ది డర్టీ పిక్చర్'​ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్​ ఒక్కసారిగా స్టార్​డమ్​ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు జాతీయ అవార్డు వరించింది. అయితే, మొదట ఆ పాత్రకోసం 'మణికర్ణిక' ఫేమ్​​ కంగనా రనౌత్​ను అడిగారు. అప్పటికే మరో సినిమాలో నటిస్టుండటం వల్ల.. కుదరదని చెప్పింది. ఆ తర్వాత కంగన చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కోల్పోయినందుకు అందరూ తనను తెలివి తక్కువ దానిలా చూసినట్లు పేర్కొంది.

'రామ్​ లీలా'లో రణ్​వీర్​ సింగ్​, దీపికా పదుకొణె జోడీ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమలో లీలా పాత్రలో నటించిన దీపిక విమర్శల ప్రశంసలు పొందింది. అయితే ఈ పాత్ర ఆఫర్ తొలుత కరీనా కపూర్​కు వెళ్లగా తిరస్కరించింది.

'భాగ్​ మిల్కా భాగ్​' చిత్రంలో అథ్లెట్​గా కనిపించి ప్రేక్షకులను ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్న నటుడు ఫర్హాన్​ అక్తర్​. ప్రారంభంలో ఈ పాత్ర కోసం బాలీవుడ్​ యాక్షన్​ కింగ్​ అక్షయ్​ కుమార్​ను సంప్రదించింది చిత్రబృందం. అప్పటికే 'తీస్​మార్​ఖాన్​' చిత్రీకరణలో బిజీగా ఉండటం వల్ల తిరస్కరించాడు.

రోహిత్​ శెట్టి సినిమా 'చెన్నై ఎక్స్​ప్రెస్'​లో షారుఖ్​ ఖాన్​కు జోడీగా దీపికా పదుకొణె నటించింది. ఈ పాత్ర తనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ క్యారెక్టర్​ కోసం ముందుగా కత్రినా కైఫ్​ను అడిగారు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు.

ఫర్హాన్​ అక్తర్ దర్శకత్వం వహించిన ప్రఖ్యాత చిత్రం 'దిల్​ చాహ్తా హై'. ఇందులో ఆమిర్ ​ఖాన్​, అక్షయ్​ ఖన్నా, సైఫ్​ అలీఖాన్​ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్తర్​ మొదట్లో ఆకాశ్​ పాత్రలో తన స్నేహితుడు హృతిక్​ రోషన్ నటించాలనుకున్నాడు. ఇక అభిషేక్​ బచ్చన్​.. సిద్​ పాత్రలో కనిపించాల్సింది. ఈ ఇద్దరు నటులు ఆ పాత్రలను తిరస్కరించడం వల్ల.. వారి స్థానంలో ఆమిర్​ ఖాన్​, అక్షయ్​ ఖన్నాలు నటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.