ETV Bharat / sitara

కరీనా నాజూకైన నడుము వెనుక రహస్యం ఇదే!

బాలీవుడ్​ బెబో కరీనా కపూర్​.. నాలుగు పదుల వయసున్నా కూడా ఇంకా అగ్రనటిగా దూసుకెళ్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లయిన ఈ భామ.. తన ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ఈ విషయాన్ని ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌ ఓ సందర్భంలో వెల్లడించారు.

kareena
కరీనా
author img

By

Published : Jun 14, 2021, 9:02 PM IST

వయసు నలభై అయినా చెక్కు చెదరని అందం బాలీవుడ్ భామ కరీనా కపూర్‌ ఖాన్ సొంతం. తొలి చిత్రం 'రెఫ్యూజీ' నుంచి ఇప్పటివరకు అదే మెరిసే చర్మం, ఆకర్షణీయమైన శరీరాకృతితో కరీనా అభిమానులను అలరించారు. కరీన ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి. మరి ఇంతందంగా కనిపించే 'బేగం పటౌడీ’' ఎంత కఠిన ఆహార నియమాలను ఆచరిస్తారో.. ఏ ప్రత్యేక ఆహారం తీసుకుంటారో అని చాలామంది భావిస్తుంటారు.

అయితే కరీనాలాగా అందంగా, నాజుగ్గా కనపడాలంటే నచ్చిన ఆహారాన్ని ముట్టుకోకుండా.. కీటోజెనిక్‌, వేగన్, ఫ్రూట్‌ డైట్‌ అంటూ రకరకాల డైట్లను అనుసరించాల్సిన అవసరం లేదంటున్నారు న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. కరీనా డైట్‌ చాలా మంది భావించే దానికి విరుద్ధంగా ఉంటుందని ఆమె వివరించారు. బెబో రోజువారీ ఆహారంలో పులావ్, మామిడిపళ్లు, జీడిపప్పు, పప్పు, కూరలు లాంటివన్నీ ఉంటాయట. కరీనా రోజూ ఐదు సార్లు ఆహారం తీసుకుంటారంటూ, ఆమె డైట్‌ ప్లాన్‌ను ఇలా వివరించారు..

kareena
కరీనా
  • ఉదయం 9 గంటలకు: నానబెట్టిన బాదం పప్పులు/అరటిపండు
  • మధ్యాహ్నం 12 గంటలకు: పెరుగన్నం- అప్పడం/రోటీ, పనీర్‌ కూర, పప్పు
  • మధ్యాహ్నం 2 గంటలకు: (స్నాక్స్‌) బొప్పాయి పండు, వేరుశనగలు, చిన్న సైజు చీజ్‌ ముక్క లేదా మఖానా
  • సాయంత్రం 5-6 గంటలకు: లిచ్చి లేదా మామిడి మిల్క్‌ షేక్/ మిక్స్చర్‌ మాదిరిగా ఉండే చివ్‌డా
  • రాత్రి 8 గంటలకు రాత్రి భోజనం: వెజిటబుల్‌ పలావ్‌, పాలక్‌ రోటీ, రైతా/పప్పు అన్నం, కూర
  • నిద్రపోయే ముందు: పసుపు లేదా జాజికాయ వేసిన పాలు

ఇవే కాకుండా మధ్యలో ఆకలేసినప్పుడు తాజా పళ్లు, పెరుగు, డ్రై ఫ్రూట్స్‌, జీడిపప్పు కూడా లాగించేస్తారట. మరి దాహం వేసినప్పుడు మంచినీరే కాకుండా..నిమ్మరసం, కొబ్బరి నీరు, ఛాజ్‌ (నల్ల ఉప్పు, ఇంగువ కలిపి మజ్జిగ) వంటి పానీయాలు తీసుకుంటారు.

ఇవీ చూడండి: Viral: సన్నీకిరాక్​ లుక్​.. స్టైలిష్​గా రౌడీ హీరో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.