బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గుజరాత్లోని ద్వారకలో శ్రీ కృష్ణుని ఆలయాన్ని దర్శించుకుంది. ద్వారకాదీశ్ గుడిలో(ద్వారక) ప్రత్యేక పూజలు చేసింది. తర్వాత నాగేశ్వరీ జ్యోతిర్లింగాన్ని సందర్శించింది.
"భగవంతుడి మీద చాలా నమ్మకం ఉంది. ఆయన ఆశీస్సులు ఉంటే చాలు. ద్వారకా సందర్శనం తర్వాత సోమనాథ్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకుంటాను".
-కంగనా రనౌత్, సినీ నటి
ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో నటిస్తోంది కంగనా. ఈ సినిమా కోసం భరతనాట్యం నేర్చుకుంది. ఎల్.విజయ్ దర్శకుడు. ప్రముఖ రచయితలు విజయేంద్ర ప్రసాద్, రజత్ అరోరా కథ అందిస్తున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి సినిమాకు నిర్మాత. జీవీ ప్రకాష్ సంగీత దర్శకుడు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. సినిమాలోనూ సందడి చేయనుంది.
ఇదీ చదవండి...