ETV Bharat / sitara

ఆలియా సినిమాపై కంగన కామెంట్స్.. రూ.200 కోట్లు బూడిదేనని పోస్ట్! - కంగన గంగూబాయ్ కతియావాడి మూవీ

Kangana alia bhatt: ఆలియా కొత్త సినిమాపై కంగనా రనౌత్ పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేసింది. రూ.200 కోట్లు బూడిద అవుతుందని ఇన్​స్టాలో పోస్ట్ పెట్టింది.

Kangana Ranaut alia bhatt
కంగనా రనౌత్ ఆలియా భట్
author img

By

Published : Feb 20, 2022, 10:46 PM IST

సినిమాలతోనే కాదు, అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌(Kangana Ranaut). ఇన్‌స్టా వేదికగా ఆమె ఇప్పుడు చేసిన కామెంట్లు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ మారాయి. ఈ శుక్రవారం విడుదలయ్యే ఓ సినిమా అట్టర్‌ఫ్లాప్‌ అవుతుందని, రూ.200 కోట్లు బూడిదేనంటూ వ్యాఖ్యానించారు. ఇంతకీ కంగనా ఎవరి గురించి? ఏమన్నారంటే?

"మూవీ మాఫియా డాడీకి ఈ శుక్రవారం బాక్సాఫీస్‌ వద్ద రూ.200 కోట్లు బూడిదైనట్టే. ఎందుకంటే అందంగా ఉంటానని భ్రమించే తెలివి తక్కువ అమ్మాయి బాగా నటిస్తుందని ఆయన నిరూపించాలనుకుంటున్నారు. ఆ సినిమాకు అతి పెద్ద లోపం నటీనటుల ఎంపికే. ఈ వారం దక్షిణాది, హాలీవుడ్‌ చిత్రాలతో స్క్రీన్స్‌ అన్నీ నిండిపోతాయి. బాలీవుడ్‌లో మూవీ మాఫియాదే పవర్‌. మాఫియా డాడీ ఒంటి చేత్తో బాలీవుడ్‌లో పని విధానాన్ని, సంస్కృతిని నాశనం చేశారు. అంతేకాదు, ఎమోషనల్‌గా పలువురు నటులు, దర్శకులను మభ్యపెడతారు. ఈ సినిమా విడుదలతో మరో ఉదాహరణ మీరు తప్పకుండా చూస్తారు. ప్రజలు ఆయనను ప్రోత్సహించడం ఇకనైనా ఆపేయాలి. ఆ మాఫియా డాడీ చేసే పనుల వల్ల ఈ శుక్రవారం ఒక పెద్ద హీరో, గొప్ప దర్శకుడు బాధితులుగా మిగులుతారు" అని కంగనా తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ప్రస్తుతం కంగనా పోస్ట్‌లు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

Kangana Ranaut takes a dig at alia bhatt
కంగన ఇన్​స్టా పోస్ట్

మరోవైపు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం 'గంగుబాయి కతియావాడి'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్‌ దేవ్‌గణ్‌ ఇందులో కీలక పాత్ర పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.