ప్రముఖ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీ చండేల్కు సమన్లు జారీ చేశారు ముంబయి పోలీసులు. ఈ నెల 23, 24 తేదీల్లో బాంద్రా స్టేషన్లో హాజరుకావాలని కోరారు.
మత కలహాలను ప్రేరేపించేలా సోషల్ మీడియాలో కంగన కామెంట్లు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు కాగా.. బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వుల మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.