దేశంలో మూక దాడుల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీకి 49 మంది ప్రముఖులు బుధవారం ఓ లేఖ రాశారు. వీరికి వ్యతిరేకంగా మరో లేఖ రాశారు సినీ నటి కంగనా రనౌత్ సహా 61 మంది ప్రముఖులు. గతంలో జరిగినవే అమానుష దాడులని, ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ఈ లేఖపై రచయిత ప్రసూన్ జ్యోతి, క్లాసికల్ డాన్సర్, ఎంపీ సోనాల్ మాన్సింగ్, వాయిద్యకారుడు పండిత్ విశ్వ మోహన్ భట్, దర్శకనిర్మాతలు మధుకర్ బండార్కర్, వివేక్ అగ్నిహోత్రి సంతకాలు చేశారు. మన్యం ప్రజలను మావోలు చంపుతుంటే ఈ ప్రముఖులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
-
The 61 personalities who have written an open letter against 'selective outrage and false narratives'. pic.twitter.com/Fdeac3KCri
— ANI (@ANI) July 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The 61 personalities who have written an open letter against 'selective outrage and false narratives'. pic.twitter.com/Fdeac3KCri
— ANI (@ANI) July 26, 2019The 61 personalities who have written an open letter against 'selective outrage and false narratives'. pic.twitter.com/Fdeac3KCri
— ANI (@ANI) July 26, 2019
తొలి లేఖలో...
సమాజంలో అశాంతి నెలకొంటుందని పేర్కొంటూ సినీ ప్రముఖులు, విజ్ఞానవేత్తలు, అనుభవజ్ఞులతో కలిపిన 49 మంది బృందం బుధవారం ప్రధానికి బహిరంగ లేఖ రాసింది. అమానుష దాడులకు పాల్పడే వారికి సత్వరమే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ముస్లింలు, అణగారిన వర్గాలు, మైనార్టీలపై ఇలాంటి దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఆ లేఖపై సంతకం చేసిన వారిలో దర్శకనిర్మాతలు అదూర్ గోపాలకృష్ణ, అపర్ణ సేన్, మణి రత్నం, శ్యామ్ బెనగల్, కేతన్ మెహతా, గౌతమ్ ఘోష్ సహా సినీ నటులు సుమిత్ర ఛటర్జీ, రేవతి, రచయిత అమిత్ చౌదరి, చరిత్రకారులు, విద్యావేత్తలైన అశిష్ నంది, సుమిత్ సర్కార్, తనిక సర్కార్, పార్థ ఛటర్జీ, రామచంద్ర గుహ, సింగర్ సుభా ముద్గల్ ఉన్నారు.