2011లో ఘనవిజయం సాధించిన 'కాంచన' సినిమా హిందీలో రీమేక్ కానుంది. బాలీవుడ్లో తెరకెక్కబోయే ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారు. హిందీలోనూ లారెన్సే దర్శకత్వం వహించనున్నాడు. 'ముని' చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమా రాఘవ లారెన్స్కు మంచి గుర్తింపు తెచ్చింది.
ఇప్పటివరకు ముని సిరీస్లో నాలుగు చిత్రాలు రాగా.. అన్నీ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇటీవల విడుదలైన కాంచన- 3 చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కాసుల వర్షం కురిపిస్తోంది. లారెన్సే హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">