మొన్నటివరకు రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించిన కమల్‌హాసన్ మళ్లీ ముఖానికి రంగువేసుకోనున్నాడు. శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 చిత్రం చేయనున్నాడు లోకనాయకుడు. ఈ సినిమా కోసం క్లీన్ షేవ్‌తో దర్శనమిచ్చాడు కమల్.
ప్రస్తుతం ఈ ఫొటో అంతర్జాలంలో హల్చల్ చేస్తోంది. 1996లో శంకర్ తెరకెక్కించిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా రానుందీ చిత్రం.
మక్కల్ నీది మయ్యమ్ అనే రాజకీయపార్టీ పెట్టాడు కమల్ హాసన్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 36 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయగా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది కమల్ పార్టీ.
ఇది చదవండి: యాషెస్: ఇంగ్లాండ్ జైత్రయాత్రా? ఆసీస్ ప్రతీకారమా?