కమల్ హాసన్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ తీస్తున్న చిత్రం 'విక్రమ్'. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై మహేంద్రన్‌తో కలిసి కమల్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, కాళిదాస్ జయరాం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం కమల్‌హాసన్ పుట్టినరోజు సందర్భంగా 'విక్రమ్ ఫస్ట్ గ్లాన్స్' పేరుతో చిత్ర బృందం వీడియో విడుదల చేసింది.
ఇందులో జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే కమల్‌హాసన్ ఆయన టీమ్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. 48 సెకన్ల నిడివి ఉన్న వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అనిరుధ్ ఇచ్చిన నేపథ్య సంగీతం కొత్తగా ఉంది. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల జరిగిన షూటింగ్‌లో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: