ETV Bharat / sitara

Shooting Resume: తమిళ హీరోల మకాం అక్కడే! - రామోజీ ఫిలింసిటీకి కమల్​హసన్​

దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు ఉండడం వల్ల తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సినిమాల షూటింగ్​కు అనుమతి లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా ఆంక్షలు సడలించడం వల్ల హైదరాబాద్​లోని రామోజీ ఫిలింసిటీ షూటింగ్​లు షురూ చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో తమిళ హీరోలు కమల్​ హాసన్​, సూర్య, కార్తి ఆ ప్రణాళికలో ముందుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Kamal Haasan, Suriya, Karthi to shift base to Hyderabad
Shooting Resume: తమిళ హీరోల మకాం ఇక్కడే!
author img

By

Published : Jun 18, 2021, 5:31 AM IST

తమిళనాడు రాష్ట్రంతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో తక్కువ కరోనా(Corona) కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో షూటింగ్​ నిర్వహించేందుకు తమిళ దర్శకనిర్మాతలు సన్నాహాలు జరుపుతున్నారు. ఇప్పటికే హిందీతో పాటు అనేక భాషల్లో రూపొందుతోన్న చిత్రాలు రామోజీ ఫిలింసిటీ(Ramoji Film City) బాట పట్టాయి.

ఈ నేపథ్యంలో స్టార్​ హీరోలంతా రెండు నెలల పాటు రామోజీ ఫిలింసిటీకి మకాం మార్చనున్నారు. ఇందులో తమిళ స్టార్​ హీరోలు కమల్​ హాసన్​, కార్తి, సూర్య కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తమ కొత్త చిత్రాలు షూటింగ్​లు తిరిగి మొదలుపెట్టేందుకు హైదరాబాద్​లోని రామోజీ ఫిలింసిటీ అనువైనదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కన్నడ సహా అనేక హిందీ చిత్రాలు ఇక్కడే షూటింగ్​ జరుపుకొంటున్నాయి.

ఇదీ చూడండి.. RajiniKanth: ఈ నెల 19న యూఎస్​కు రజనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.