ETV Bharat / sitara

ఓటీటీలో కల్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి'! - కల్యాణ్ దేవ్ సూపర్ మచ్చి

చిరు అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన చిత్రం 'సూపర్ మచ్చి'. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్లకు రాలేకపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని చూస్తోందట చిత్రబృందం.

super machi
సూపర్ మచ్చి
author img

By

Published : May 25, 2021, 12:16 PM IST

Updated : May 25, 2021, 2:07 PM IST

అగ్ర కథానాయకుడు చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా నటించిన చిత్రం 'సూపర్‌ మచ్చి'. పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమైంది. రియా చక్రవర్తి, రుచితా రామ్‌ కథానాయికలుగా నటించారు. రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమా కరోనా వైరస్‌ కారణంగా విడుదలకు నోచుకోలేకపోయింది. తాజాగా మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. కానీ త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

అంతా సవ్యంగా ఉంటే ఈ ఏడాది మార్చిలోనే థియేటర్లో విడుదల కావాల్సింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి ఫస్టులుక్‌ టీజర్‌, లిరికల్ సాంగ్స్ విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌, పోసాని కృష్ణమురళి, ప్రగతి తదితరులు నటించారు. తమన్‌ సంగీత స్వరాలు అందించగా శ్యామ్‌ కె.నాయుడు కెమెరామెన్‌గా పనిచేశారు.

Last Updated : May 25, 2021, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.