ETV Bharat / sitara

కోటి ఫాలోవర్స్​తో దూసుకెళ్తోన్న కాజోల్ - కాజోల్​ కొత్త సినిమా అప్​డేట్​

నటిగానే కాకుండా వ్యక్తిత్వంతోనూ అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కాజోల్​. ఇన్​స్టాగ్రామ్​లో తనను​ కోటి మంది ఫాలో అవడంపై ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Kajol clocks 10 mn followers on Instagram
కోటి ఫాలోవర్లతో దూసుకెళ్తోన్న కాజోల్
author img

By

Published : Apr 12, 2020, 12:44 PM IST

Updated : Apr 12, 2020, 12:49 PM IST

బాలీవుడ్ క్లాసిక్​ చిత్రాల్లో ఒకటైన ‘'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే' చిత్రంతో కుర్రకారును ఉర్రూతలూగించింది బాలీవుడ్​ హీరోయిన్​ కాజోల్​. జనరేషన్లతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో కోటి మంది ఫాలోవర్స్​ను సాధించిందీ స్టార్​ హీరోయిన్​​. దీనిపై శనివారం ఆమె అభిమానులను ఉద్దేశిస్తూ.. ఓ వీడియో పోస్ట్​ చేసింది.

"రీల్​ లైఫ్​ నుంచి రియల్​ లైఫ్​ వరకు నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. మీ కాజోల్​."

-- కాజోల్​, కథానాయిక

ఈ సందర్భంగా 2001లో విడుదలైన 'కభీ ఖుషి కభీ ఘమ్​' చిత్రంలో కాజోల్​ చేసిన భాంగ్రా డ్యాన్స్​ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇటీవల ఈ హీరోయిన్ 'తానాజీ' సినిమాలో ఆమె భర్త అజయ్​ దేవగణ్​ సరసన ప్రధానపాత్ర పోషించగా.. ప్రియాంక బెనర్జీ దర్శకత్వంలో రూపొందిన 'దేవి' లఘుచిత్రంలో చివరిసారిగా నటించింది.

ఇదీ చూడండి.. 'వినరా సోదరా! వినకుంటే ఇల్లు ఆగమైతదిరా..!'

Last Updated : Apr 12, 2020, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.