అందం, అభినయంతో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్న కాజల్.. ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న తమిళ వెబ్ సిరీస్ 'లైవ్ టెలీకాస్ట్'కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోందీ పోస్టర్. ఇందులో భయపెట్టే కళ్లతో సీరియస్గా కనిపించిన కాజల్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇంటెన్స్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ సిరీస్లో ఆనంద్ జీ, వైభవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఇది విడుదల కానుంది.
-
Presenting my debut on @DisneyplusHSVIP coming soon- LIVE TELECAST @vp_offl pic.twitter.com/z5qCT79aDr
— Kajal Aggarwal (@MsKajalAggarwal) October 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Presenting my debut on @DisneyplusHSVIP coming soon- LIVE TELECAST @vp_offl pic.twitter.com/z5qCT79aDr
— Kajal Aggarwal (@MsKajalAggarwal) October 23, 2020Presenting my debut on @DisneyplusHSVIP coming soon- LIVE TELECAST @vp_offl pic.twitter.com/z5qCT79aDr
— Kajal Aggarwal (@MsKajalAggarwal) October 23, 2020
ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను ఈ నెల చివర పెళ్లి చేసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించింది కాజల్. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరుగనుంది.
ఇదీ చూడండి 'అసాధ్యమైనా.. చేయగలను అనుకుంటున్నా'