దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ముంబయి లాల్బాగ్ ఆలయానికి టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ విచ్చేసింది. వినాయక ఉత్సవాల సందర్భంగా గణనాథుడుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. తల్లితో కలిసి దర్శనం చేసుకుని విఘ్నేశ్వరుడి సేవలో పాల్గొంది.
ఈ ఏడాది 'సీత', 'రణరంగం', 'కోమలి' సినిమాలతో సందడి చేసింది కాజల్. ప్రస్తుతం తమిళంలో 'భారతీయుడు 2', సూర్యతో కలిసి ఓ చిత్రంలోనూ నటిస్తోంది. బాలీవుడ్లో 'ముంబయి సాగా'లో టీనేజీ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మి హీరోలుగా నటిస్తున్నారు.
ఇదీ చూడండి: వంద మంది డ్యాన్సర్లతో కంగనా సందడి!