నటి కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు, బిజినెస్మెన్ గౌతమ్ కిచ్లును వివాహమాడింది. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో వీరిద్దరి వివాహం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. కాజల్ వివాహానికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నూతన జంటకు నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



