ETV Bharat / sitara

Kajal agarwal: హీరోయిన్ కాజల్.. మరో థ్రిల్లర్​లో! - chiranjeevi kajal agarwal acharya

హీరోయిన్ కాజల్ అగర్వాల్, తన పెళ్లి తర్వాత వరుసగా థ్రిల్లర్లు చేస్తోంది. ఇటీవల 'లైవ్ టెలికాస్ట్'తో ప్రేక్షకుల్ని పలకరించిన ఈమె.. ఇప్పుడు అదే తరహాలో ఉండే మరో కథలో నటించేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

kajal aggarwal in another thriller movie
హీరోయిన్ కాజల్ అగర్వాల్
author img

By

Published : May 30, 2021, 7:46 AM IST

కథానాయిక కాజల్‌ ఇప్పుడు థ్రిల్లర్లపై ఆసక్తి పెంచుకుంటోంది. ఆమె ఇటీవలే ‘లైవ్‌ టెలికాస్ట్‌’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు థ్రిల్‌ పంచి, ఆకట్టుకుంది. ఇప్పుడీ అమ్మడు మరో థ్రిల్లింగ్‌ కథతో వెండితెరపైనా మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆమె ఇటీవలే జయశంకర్‌ అనే దర్శకుడు చెప్పిన కథకు పచ్చజెండా ఊపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘పేపర్‌బాయ్‌’ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన దర్శకుడాయన. ఇటీవలే ఓటీటీలో ‘విటమిన్‌ - షీ’ సినిమాతో ఆకట్టుకున్నారు. ఇప్పుడాయన కాజల్‌ కోసం ఓ విభిన్నమైన థ్రిల్లర్‌ కథ సిద్ధం చేశారట.

kajal aggarwal in another thriller movie
హీరోయిన్ కాజల్

ఆ స్క్రిప్ట్‌ కాజల్‌కు నచ్చడం వల్ల సినిమా పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీన్ని హీరోయిన్ ఓరియెంటడ్ చిత్రంగా ముస్తాబు చేయనున్నారు. ఓ ప్రముఖ నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాజల్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆమె ప్రస్తుతం చిరంజీవికి జోడీగా 'ఆచార్య' సినిమాలో నటిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.