ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన సృహలోకి వస్తున్నారని, రక్తపోటు స్థిరపడుతోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదలైంది.
కైకాల కిడ్నీ పనితీరు మెరుగుపడుతోందని, మూత్ర విసర్జన సక్రమంగా జరుగుతోందని రిపోర్టులో ఉంది. ప్రస్తుతానికి ఐసీయూలోనే ఉన్నా.. వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోందని సమాచారం.
తప్పుడు ప్రచారంపై కైకాల కుమార్తె స్పందన
కైకాల ఆరోగ్యం గురించి పలు రకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన ఆయన కుమార్తె రమాదేవి.. ప్రస్తుతం కైకాల ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిపారు. ఆయన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. "నాన్నగారు క్రమంగా కోలుకుంటున్నారు. చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కైకాల ఆరోగ్యంపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు" అని రమాదేవి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Kaikala satyanarayana health: కైకాలతో ఫోన్లో మాట్లాడిన చిరు..