ETV Bharat / sitara

'చంద్రముఖి '2పై జ్యోతిక ఏమన్నారంటే! - చంద్రముఖి 2 గురించి జ్యోతిక

రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'చంద్రముఖి' ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తెరకెక్కబోతుంది. అయితే ఈ విషయం గురించి జ్యోతికను ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు.

జ్యోతిక
జ్యోతిక
author img

By

Published : May 22, 2020, 10:19 AM IST

రజనీకాంత్‌ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'చంద్రముఖి'. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా 'వారాయ్‌' పాట విశేష ప్రేక్షకాదరణ పొందింది. స్కూళ్లు, కాలేజీలు, టెలివిజన్‌ షోలు ఎక్కడ చూసినా ఆ పాటకు డ్యాన్స్‌ వేయకుండా ముగిసేది కాదంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రానికి కొనసాగింపుగా 'చంద్రముఖి 2' సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇటీవలే దీన్ని ప్రకటించారు.

తొలి చిత్రంలో గంగ/చంద్రముఖిగా రెండు భిన్న పాత్రల్లో నటించిన జ్యోతికను 'చంద్రముఖి 2' గురించి ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సీక్వెల్‌ కోసం తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. అసలు ఆ ప్రాజెక్టు గురించే తనకు తెలియదని చెప్పుకొచ్చారు.

జ్యోతిక కీలక పాత్రలో జె.జె. ఫెడ్రిక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'పొన్‌మగళ్‌ వందాళ్‌' చిత్రం మే 29న అమెజాన్‌ వేదికగా విడుదల చేయనున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా నిర్మాత సూర్య ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఓటీటీ వేదికగా విడుదలవుతున్న తొలి తమిళ చిత్రంగా 'పొన్‌మగళ్‌ వందాళ్‌' రికార్డు సృష్టించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.