చాలా ఏళ్ల విరామం తర్వాత '36 వయోదినిలే' సినిమాతో జ్యోతిక రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఆమె నటించిన 'రాక్షసి' సినిమా విడుదలై ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం జ్యోతిక ప్రధాన పాత్రలో మరో సినిమా తెరకెక్కుతోంది. ఆమె భర్త సూర్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
సూర్య నిర్మాతగా 2డీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పుడు జ్యోతిక నటిస్తున్న చిత్రాన్ని ఈ సంస్థలో సూర్య నిర్మిస్తున్నాడు. 'పొన్మగల్ వందాల్' పేరుతో వస్తున్న ఈ సినిమా ఓ సందేశాత్మక చిత్రమని సమాచారం.
ఈ సినిమతో జేజే ప్రట్రిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో సీనియర్ దర్శక నటులు భాగ్యరాజ్, పాండియరాజన్, పార్తిబన్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. చిత్ర పూజా కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది.
జ్యోతిక తన మరిది కార్తీకి అక్కగా మరో చిత్రంలో నటిస్తోంది. సత్యరాజ్, అన్సన్ పాల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్లో విడుదలకానుంది.
ఇది సంగతి: కొబ్బరిమట్ట కోసం సంపూ కిరాక్ డాన్స్