మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'సైరా నరసింహారెడ్డి'.. వచ్చే నెల 2న విడుదలకు కానుంది. ఈ సమయంలో చిత్రబృందంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఉయ్యాలవాడ వంశీయులు.
ఇదీ ఆరోపణ..
కథ విషయంలో ఒప్పందం చేసుకుని మోసం చేశారని ఉయ్యాలవాడ వంశీయులు ఫిర్యాదు చేశారు. నరసింహారెడ్డి కథను తమ నుంచి సేకరించి... ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణ చేశారు. చిత్ర దర్శకుడు, నిర్మాతలను కీలకంగా ప్రస్తావించారు. కథను తీసుకున్నందుకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆదివారం ప్రీ రిలీజ్ వేడుక...
ఈ నెల 22న సైరా ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఇప్పటికే శాటిలైట్, డిజిటల్ హక్కులు ఏకంగా 125 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని 40 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవితో పాటు బిగ్‌బి అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి ప్రముఖులు ఇందులో నటించారు. రూ.250 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించాడు రామ్ చరణ్. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.