ఆయన మోడల్.. తరువాత సినీ యాక్టర్. ఆపై ప్రొడ్యూసర్. ఇలా తన సృజనను వివిధ రూపాల్లో ప్రదర్శించిన జనాకర్షక వ్యక్తి . నటనాప్రతిభకీ కొన్ని పురస్కారాలు, అశేష అభిమానుల విశేష అభినందనలు అందుకుంటూ కెరీర్‌లో ముందుకు దూసుకుపోతున్నాడు. అతడే.. జాన్ అబ్రహం. అనేకానేక వాణిజ్య ప్రకటనలకు మోడలింగ్ చేసిన తరువాత, 2003లో జిస్మ్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ద్వారా ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ పురస్కారానికి కూడా నామినేట్ అయ్యాడు. ఆ తరువాత 2004లో ధూమ్ అనే సినిమా ద్వారా మొదటి కమర్షియల్ విజయాన్ని పొందాడు. 1972 డిసెంబర్ 17న జాన్ అబ్రహం పుట్టిన రోజు. ఈ సందర్బంగా ప్రత్యేక కథనం మీ కోసం...
కులమతాతీత కుటుంబ నేపథ్యం
అబ్రహం రకరకాల మతాలు, జాతులు, వారసత్వాలు కలిసిన కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి కేరళకు చెందిన మలయాళీ ప్రొటెస్టంట్ సిరియన్ క్రిస్టియన్. తల్లి గుజరాతీ మూలాలు ఉన్న ఇరానీ దేశస్తురాలు. జొరాస్టియ్రన్ మతము ప్రకారం అబ్రహం అసలు పేరు ఫర్హాన్. కానీ అతను జాన్ పేరుతో బాప్తిజం తీసుకున్నాడు. ఆయనకి సోదరుడు ఎలాన్ ఉన్నారు. తనను తాను ఆధ్యాత్మిక వ్యక్తిగా భావించినా ఏ ప్రత్యేకమైన మతాన్ని అనుసరించరు జాన్. ముంబయిలోనే పెరిగి విద్యాభ్యాసం చేశాడు. అతని కజిన్ సూసీ మాథ్యూ రచయిత. ఆయన ఇన్ ఏ బబుల్ ఆఫ్ టైమ్‌లాంటి నవలలు రాశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కెరీర్
పంజాబీ గాయకుడు జైజీ బి సృష్టించిన ఓ మ్యూజిక్ వీడియో ద్వారా అబ్రహం మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించాడు. 1999లో గ్లాడ్ ర్యాగ్స్ మ్యాన్ హంట్ కాంటెస్ట్‌లో గెలిచి ఫిలిప్పీన్స్‌లో జరిగే మ్యాన్ హంట్ ఇంటర్నేషనల్‌లో పాల్గొన్నాడు. అందులో రెండవ స్థానంలో నిలిచాడు. ఆ తరువాత హాంగ్ కాంగ్, లండన్, న్యూ యార్క్ సిటీలలో మోడలింగ్ చేశాడు. ఎన్నో కమర్షియల్ వాణిజ్య ప్రకటనలలో కనిపించాడు. పంకజ్ ఉధాస్, హన్స్ రాజ్ హన్స్, బాబుల్ సుప్రియో వంటి గాయకుల మ్యూజిక్ వీడియోలలో కనిపించాడు.
తెరంగేట్రం
సినిమాల్లోకి రాకముందే భారత దేశ అగ్రమోడల్‌గా గుర్తింపు పొందాడు జాన్ అబ్రహం. 2003నాటి అబ్రహం మొదటి సినిమా జిస్మ్ బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా నిలిచింది. కబీర్ లాల్ అనే లాయర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకు మిశ్రమ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.అదే ఏడాదిలో, అనురాగ్ బసు దర్శకత్వం వహించిన సాయ సినిమాలో తారా శర్మ, మహిమా చౌదరిలతో కలిసి నటించాడు. అలా పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
విజయాల మజిలీలు
2004లో ధూమ్ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడైన కబీర్ పాత్రలో జాన్ అబ్రహం నటించాడు. సంజయ్ గద్వి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఇందులో అభిషేక్ బచ్చన్, ఈషా డియోల్, ఉదయ్ చోప్రా, రిమి సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదలైన ఆ ఏడాదిలో మూడవ అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.
2005లో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఎలాన్ సినిమాలో అర్జున్ రాంపాల్‌తో కలిసి స్కీన్ర్‌ను షేర్ చేసుకొన్నాడు జాన్ అబ్రహం. ఆ తరువాత కాల్, గరం మసాలా చిత్రాల్లో నటించాడు. ఎలాన్ సినిమా బాక్సాఫీసు వద్ద ఊహించిన ఫలితం ఇవ్వకపోయినా ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బాగా ఆడాయి. అదే సంవత్సరంలో, 1930లలో బ్రిటిష్ ఇండియాలో హిందూ వితంతువుల జీవిత విషాద గాధ నేపథ్యంతో తెరకెక్కిన వాటర్ సినిమాలో ఓ పాత్రలో నటించాడు. దీపా మెహతా రచన, దర్శకత్వం చేశారు. ఈ చిత్రం అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. ఇంకా 79వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 2006 అకాడమీ అవార్డుకు నామినేట్ అయింది. అయితే, ఆ వేడుకలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ది లైవ్స్ ఆఫ్ అదర్స్ అనే జర్మన్ సినిమా గెలుచుకొంది.
2006 వేసవిలో రాక్స్టార్స్ కన్సర్ట్ అనే వేడుకలో సల్మాన్ ఖాన్, జాయేద్ ఖాన్, కరీనా కపూర్, ఈషా డియోల్, షాహిద్ కపూర్, మల్లికా శెరావత్‌లతో జాన్ అబ్రహం కూడా ప్రదర్శించాడు. ఆ సంవత్సరంలోనే, జిందా, టాక్సీ నెంబర్ 9211, బాబుల్, కాబూల్ ఎక్స్‌ప్రెస్ సినిమాల్లో నటించాడు. వీటన్నింటిలో టాక్సీ నెంబర్ 9211, కాబూల్ ఎక్స్‌ప్రెస్స్ సినిమాలు ఎంతో మంచి విజయాలను అందుకున్నాయి. టాక్సీ నెంబర్ 9211లో అతడు కనబర్చిన నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. ప్రతి కొత్త సినిమాతో తన నటనని మెరుగుపరుచుకుంటున్నట్లు వారు కొనియాడారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నిర్మాతగా
జాన్ అబ్రహం నిర్మించిన మొదటి సినిమా విక్కీ డోనర్. 2012నాటి ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, అన్ను కపూర్, యామి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో ఓ ఐటెం నెంబర్‌లో జాన్ అబ్రహం కూడా కనిపించాడు. పాజిటివ్ రెస్పాన్స్‌తో మొదలైన ఈ సినిమా విమర్శనాత్మక, కమర్షియల్ విజయాన్ని సాధించింది. ఆయన రెండో నిర్మాణం మద్రాస్ కేఫ్‌ను కూడా వికీ డోనర్‌ను తెరకెక్కించిన సూజిత్ సర్కారే తెరకెక్కించాడు. ఆ సినిమా కూడా విమర్శకుల నుంచి అత్యధిక స్పందనని అందుకుంది. ఇంకా రాకీ హ్యాండ్ సమ్ ఫోర్స్ 2, పర్మాను: ద స్టోరీ ఆఫ్ పోఖ్రాన్, బాట్లా హౌస్ సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సామాజిక సేవ
జాన్ అబ్రహం జంతు ప్రియుడు. పెటా హబిటాట్ ఫర్ హ్యుమానిటీపై ఆసక్తి చూపుతాడు. ఏప్రిల్ 2013లో, పెటా తరపున, అబ్రహం పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జయంతి నటరాజన్‌కు ఒక లేఖ రాశారు. భారతదేశంలోని అన్ని సర్కస్‌లను జంతురహితంగా చేయమని ఆ లేఖలో ఆమెను కోరాడు. జాన్ అబ్రహం ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ ఇండియాకు సెలబ్రిటీ మద్దతుదారుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన వెబ్‌సైట్ ప్రకారం ముంబయిలోని లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు 10 లక్షలు విరాళంగా ఇచ్చాడు. కాగా, జాన్ అబ్రహం భార్య పేరు ప్రియా రన్‌చల్. 2014 జనవరి 3న వీరు వివాహం చేసుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : అబ్బో.. ఆ సినిమాలో ఎన్నెన్ని ముద్దులో!