డార్లింగ్ ప్రభాస్ హీరోగా, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్' శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం గురించి రోజుకో వార్త వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఓ ఆసక్తికర విషయం చర్చనీయాంశమవుతోంది.
ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంను చిత్రబృందం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ విషయం చర్చల దశలోనే ఉందని, త్వరలో స్పష్టత రానుందని టాక్. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు 'సలార్'లో ప్రభాస్ ద్విపాత్రాభినయం కూడా చేయనున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అభిమానుల్లో చర్చ నడుస్తున్న పలు వార్తలపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు ఎదురుచూడాల్సిందే.
ఇదీ చూడండి: 'సీత'గా కరీనా కపూర్.. రావణుడిగా రణ్వీర్ సింగ్?