ETV Bharat / sitara

అమితాబ్ సతీమణి జయా బచ్చన్​కు కొవిడ్ - అమితాబ్ జయా బచ్చన్​ కొవిడ్

Jaya bachchan covid 19: ప్రముఖ సీనియర్ నటి జయా బచ్చన్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉన్నారు. దీంతో ఆమె నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ఆగిపోయింది.

Jaya Bachchan COVID-19
జయా బచ్చన్ కొవిడ్
author img

By

Published : Feb 4, 2022, 2:57 PM IST

Jaya bachchan coronavirus: బిగ్​బీ అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ కొవిడ్ బారిన పడ్డారు. నెలవారి హెల్త్​ చెకప్​లో ఈ విషయం బయటపడింది. ముంబయిలోని తన ఇంట్లో ప్రస్తుతం జయ హోం ఐసోలేషన్​లో ఉన్నారు.

కరోనా ఫస్ట్​వేవ్​లో జయ భర్త అమితాబ్, కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యకు వైరస్​ పాజిటివ్​గా తేలింది. అప్పుడు జయా బచ్చన్​కు మాత్రమే నెగిటివ్​ వచ్చింది. ఇప్పుడు ఆమె కొవిడ్ బారిన పడ్డారు. ఇటీవల జయ కుమార్తె శ్వేతా బచ్చన్​కు కూడా ఈ వైరస్​ సోకినట్లు తేలింది.

కరన్ జోహార్ తెరకెక్కిస్తున్న 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' సినిమాలో జయా బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. దిల్లీలో షూటింగ్ జరుగుతోంది. అందులోనే నటిస్తున్న సీనియర్ నటి షబానా అజ్మీ కొవిడ్​ బారిన పడ్డారు. ఇప్పుడు జయకు కూడా పాజిటివ్​గా తేలింది. దీంతో ఈ సినిమా చిత్రీకరణనను తాత్కాలికంగా నిలిపేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.