న్యూదిల్లీలో జరిగిన 'కాలింగ్ షెహ్మత్' పుస్కకావిష్కరణ కార్యక్రమానికి హాజరైంది హీరోయిన్ జాన్వీ కపూర్. అందులో చేసిన చిన్న పొరపాటు కారణంగా ట్రోలింగ్‌కు గురైంది.
ఇంతకీ జరిగిందేమిటి..?
ప్రముఖ రచయత హరీందర్ సిక్కా రచించిన 'కాలింగ్ షెహ్మత్' (హిందీ) పుస్తకావిష్కరణలో పాల్గొన్న హీరోయిన్ జాన్వీ కపూర్.. తనకిచ్చిన బుక్‌ను వ్యతిరేక దిశలో పట్టుకుంది. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని సరిచేసింది. అప్పటికే ఆ ఫొటోలు వైరల్ అవడం వల్ల నెటిజన్ల చేతిలో ట్రోలింగ్‌కు గురైంది.
భారతీయ గూఢచారిగా పనిచేసే ఓ కశ్మీర్ బాలిక జీవితమే ఈ పుస్తకంలోని కథాంశం. బాలీవుడ్లో ఈ నవల ఆధారంగానే 'రాజీ' సినిమా వచ్చింది. అలియా భట్, విక్కీ కౌశల్ హీరో హీరోయిన్లుగా నటించారు.
'రూహ్-అఫ్జా' టైటిల్‌తో రూపొందుతున్న హారర్ కామెడీలో నటిస్తోంది హీరోయిన్ జాన్వీ కపూర్. రాజ్‌కుమార్ రావ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదే కాకుండా భారత వాయుసేన ఫైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో గుంజన్ పాత్రలో నటిస్తోంది జాన్వీ. అదే విధంగా కరణ్ జోహార్ తీస్తున్న 'తఖ్త్'లోనూ ఓ విభిన్న పాత్ర చేసేందుకు సిద్ధమవుతోంది. లాస్ట్ స్టోరీస్‌కు కొనసాగింపుగా వస్తోన్న ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఇది చదవండి: బెల్లీ డ్యాన్స్‌తో అదరగొడుతున్న జాన్వీ కపూర్