ETV Bharat / sitara

కృష్ణవంశీ దర్శకత్వంలో జాన్వీ కపూర్‌? - కృష్ణవంశీ దర్శకత్వంలో జాన్వీ కపూర్‌

కృష్ణవంశీ దర్శకత్వంలో తెలుగు తెరకు పరిచయం కానుంది బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్​. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

janvi
జాన్వీ
author img

By

Published : Feb 16, 2021, 7:27 PM IST

కృష్ణవంశీ సినిమాలంటే భారీ తారాగణంతో పాటు కథ కూడా వైవిధ్యంగా ఉంటుందని పేరు. మహిళా ప్రాధాన్యం ఉన్న కథతో ఆయన ఓ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఇందులో కథానాయికగా బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ని ఎంపిక చేయనున్నానారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఓ కథను సిద్ధం చేసుకున్నారట, దానికి సంబంధించిన స్ర్కిప్టు కూడా సిద్ధమైందని సమాచారం. జాన్వీ కపూర్‌ నటించిన 'గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌' చూసిన తరువాత కృష్ణవంశీ రాసుకున్న కథకు జాన్వీ అయితేనే సరిపోతుందని భావించారట.

ఇప్పటికే జాన్వీ తండ్రి బోనీకపూర్‌తో చర్చలు కూడా జరిపారని తెలిసింది. కానీ, అటువైటు నుంచి రావాల్సిన స్పందన కోసం వేచి చూస్తున్నారు. బోనీ నిర్మాతగా హిందీలో కృష్ణవంశీ దర్శకత్వంలో 'శక్తి: ది పవర్‌' అనే చిత్రం రూపొందించారు. ఈ విధంగా చూస్తే జాన్వీ కపూర్‌ను‌ తెలుగు తెరకు పరిచయం చేసే అదృష్టం వంశీకే దక్కనుంది. ప్రస్తుతం ఆయన 'రంగ మార్తాండ' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జాన్వీ 'గుడ్‌ లక్‌ జెర్రీ', 'రూహి’' 'దోస్తానా2' లాంటి చిత్రాలతో బిజీగా ఉంది.

ఇదీ చూడండి: భయపెడుతున్న జాన్వీ- 'షాదీ ముబారక్'​ టీజర్​ రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.