"అమ్మతో పోల్చడం అనేది నాపై ఒత్తిడి పెంచదు. బాధ్యతను పెంచుతుంది" అంటోంది జాన్వీ కపూర్ (Janhvi kapoor). శ్రీదేవి ముద్దుల తనయగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు తొలిచిత్రం 'దఢక్'తోనే మంచి నటనతో ఆకట్టుకుంది. తర్వాత 'గుంజన్ సక్సేనా' (Gunjan Saxena) తో తన ప్రతిభను నిరూపించుకుంది.
![Janhvi Kapoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/176621370_1881978615310991_4631376637406947099_n_3004newsroom_1619759684_4.jpg)
ఇటీవల ఓ ఫ్యాషన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అందాల భామ మాట్లాడుతూ "అమ్మతో నన్ను పోల్చి చూడటం అదృష్టంగా భావిస్తా. ఆమె వల్లే నాకు ఈ జీవితం లభించింది. ఇంతమంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఆమె నాకు ఎప్పటికీ ఆదర్శమే. అమ్మంతా కాకపోయినా నా నటనతో అభిమానులను ఎప్పుడూ నిరాశ పరచను. వారంతా నాలో అమ్మను చూసుకుంటున్నారు. అందుకే అమ్మ శ్రీదేవితో పోల్చడం నా బాధ్యతను మరింత పెంచుతుందిఠ" అని చెప్పుకొచ్చింది జాన్వీ.