ETV Bharat / sitara

40 నిమిషాల ఛేజింగ్​.. 90 కార్లు ధ్వంసం

కొన్ని సినిమాల్లో విలన్ల నుంచి తప్పించుకోవడానికి హీరోలు వాహనంపై దూసుకుపోతుంటే.. ఛేజ్​ చేసే సన్నివేశాలు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తాయి. అటువంటిది 40 నిమిషాల పాటు సాగే సన్నివేశమైతే.. ఛేజింగ్​లో 90 కార్లు ధ్వంసమైతే.. ఆ సీన్​ ఎలా ఉంటుందో ఊహించలేం. అత్యధిక నిడివిగల కార్ ఛేజింగ్ సీన్ 'గాన్ ఇన్ 60 సెకండ్స్​' అనే సినిమాలో చిత్రీకరించారు.

car chase
కారు ఛేజింగ్​
author img

By

Published : Aug 26, 2021, 9:08 PM IST

సాధారణంగా యాక్షన్ సినిమాలంటే కార్ చేజింగ్​ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. హీరో వాహనంపై దూసుకుపోతుంటే విలన్లు వెనుక నుంచి ఛేజ్​ చేసే సీన్లు సినీ ప్రియులకు థ్రిల్​ను కలిగిస్తుంటాయి. మరి.. అత్యంత ఎక్కువ నిడివి గల చేజింగ్​ సన్నివేశం ఏ సినిమాలో ఉందో తెలుసా? 'గాన్ ఇన్ 60 సెకండ్స్'​ అనే హాలీవుడ్​ చిత్రంలో. 40 నిమిషాల పాటు ఓ చేజింగ్​ సన్నివేశం ఈ సినిమాలో ఉంది.

ఈ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో 90 కార్లు ధ్వంసం అయ్యాయి. 1974లో వచ్చిన ఈ చిత్రంలోని ఛేజింగ్ సీన్.. అత్యంత ఎక్కువ నిడివి ఉన్న సన్నివేశంగా ఘనత కెక్కింది. లక్షా యాభై వేల డాలర్లతో తెరకెక్కిన ఈ సినిమా నాలుగు కోట్ల డాలర్లను వసూలు చేసి అప్పట్లో సంచలన విజయం సాధించింది.

హెచ్​.బి.హలిక్కి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆయనే కథ సమకూర్చి నిర్మించాడు. ఇంకో విశేషమేమంటే ఇందులో హీరో కూడా హలిక్కినే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: విలన్లతో ఓ ఆటాడి వచ్చిన సూపర్​స్టార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.