తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ తెరంగేట్రం చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటించనున్నాడు. శుక్రవారం నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్లో జరగనుంది.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్. రిచర్డ్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుందీ చిత్రం.
ఇదీ చదవండి: రాక్షసుడి ప్రయోగం మళ్లీ ఫలిస్తుందా..!