రోజూ ఉదయాన్ననే లేచి గుర్రపు స్వారీ చేయడం ఎంతో ఆనందాన్నిస్తోందని బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెబుతోంది. కొన్ని రోజులుగా రణ్వీర్ సింగ్‌తో కలిసి 'సర్కస్' చిత్రీకరణలో బిజీగా గడిపిన ఈ భామ.. కాస్త విరామం తీసుకుంది. ఈ సమయంలో హార్స్ రైడింగ్ చేయడం ప్రారంభించింది. ఆ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఉదయాలు మనల్ని రీఛార్జి చేసకోవడానికి పనికొచ్చే అద్భుత సమయాలు.. ఎంతో ఉత్సాహమిచ్చే ఉదయాలను ఎవరూ మిస్ అవొద్దు. షూటింగ్‌లతో నేను వీటిని ఎక్కువగా మిస్ అవుతుంటా"
-జాక్వెలిన్ ఫెర్నాండేజ్, బాలీవుడ్ నటి
హాట్‌హాట్ లుక్స్‌తో అభిమానులను ఊరించే ఈమె.. ప్రస్తుతం 'భూత్ పోలీస్'లో నటిస్తోంది. ఈ ఏడాదే సినిమా విడుదల కానుంది. సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, యామీ గౌతమ్ తదితరులు ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరో రెండు కొత్త ప్రాజెక్టుల కబుర్లు త్వరలోనే ప్రకటిస్తానని జాక్వెలిన్ చెప్పింది.
ఇదీ చూడండి: మాల్దీవుల విహారయాత్రలో ఇషాన్ ఖత్తర్, అనన్య!