జబర్దస్త్(jabardast) లేటేస్ట్ ప్రోమో విడుదలైంది. యాంకర్ అనసూయ(Anasuya) మరో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి, కోపంతో షో నుంచి బయటకు వెళ్లిపోయింది.
ఏం జరిగింది?
హైపర్ ఆది(hyper aadi), రాకెట్ రాఘవ, అదిరే అభి వీరంతా తమ స్క్రిప్ట్‌లతో పంచ్‌లు, కామెడీ చేస్తూ వీక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే ఈ షోలో హైపర్ ఆది టీమ్‌లో యూట్యూబ్ యాంకర్ శివ కూడా కనిపించాడు. ఈ క్రమంలోనే అతడు.. 'పొట్టి డ్రెస్స్‌లు ఎందుకు వేసుకుంటావ్?' అని వేదికపై అనసూయను ప్రశ్నించాడు? 'ఇది నా పర్సనల్' అంటూ ఆమె బదులిచ్చింది. ఇలా వీరిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరగడం, ఆ తర్వాత అనసూయ కోపంతో షో మధ్యలో నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో జడ్జెస్ రోజా(roja), మనులతో సహా వీక్షకులకు షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే జూన్ 24న పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'జబర్దస్త్' అదిరే అభిని మోసం చేసిన ఆ నిర్మాత!