రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పాటలకు కుర్రకారు ఉర్రూతలూగాల్సిందే. అతడి హుషారైన గీతాలు అలా ఉంటాయి. ఐటమ్ సాంగ్స్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. అందులోనూ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలకు మరింత ఎనర్జీతో పాటలందిస్తాడు దేవి. ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ మంచి గుర్తింపు పొందాయి. తాజాగా ఇదే కాంబోలో ఇప్పుడు 'పుష్ప' తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలోని పాటలను ఇప్పటికే కంపోజ్ చేశాడట దేవి. అందులో ఓ ఐటమ్ సాంగ్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని టాక్. ఈ సాంగ్ అదిరిపోయేలా ఉంటుందని చిత్రసీమలో అనుకుంటున్నారు.
కరోనా కారణంగా 'పుష్ప' చిత్రీకరణ వాయిదా పడింది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.