ETV Bharat / sitara

'శంకర్'​ సినిమాలో చెర్రీకి జోడీగా కియారా! - దిల్​రాజు

రామ్​చరణ్, కియారా అడ్వాణీ కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు వినయ విధేయ రామ సినిమాలో జోడీ కట్టిన ఈ జంట మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. దిల్​రాజు నిర్మాణంలో శంకర్​ దర్శకత్వంలో రానున్న ఈ మూవీ ప్రకటన.. ఇదివరకే అధికారికంగా వెలువడింది.

It seems that Ram Charan and Kiara Advani will act together
రామ్​చరణ్​తో మరోసారి జతకట్టనున్న కియారా!
author img

By

Published : Mar 12, 2021, 7:37 AM IST

Updated : Mar 12, 2021, 9:08 AM IST

రామ్​చరణ్​.. కియారా అడ్వాణీ మరోసారి జోడీ కట్టనున్నారా? అంటే అవుననే చెబుతున్నాయి సినీవర్గాలు. 'ఆర్​ఆర్​ఆర్' తర్వాత చరణ్​ కథా నాయకుడిగా శంకర్​ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్​రాజు నిర్మించనున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. జులై నుంచి సెట్స్​పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందుకే చెర్రీకి జోడీగా నాయికను ఖరారు చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం.

ఈ పాత్ర కోసం కొరియన్ భామ సుజీబేను తీసుకోనున్నట్లు నిన్నమొన్నటి వరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఈ అవకాశాన్ని కియారా అందుకోనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇది వీళ్లిద్దరి కలయికలో రానున్న రెండో చిత్రమవుతుంది. చరణ్​, కియారా గతంలో 'వినయ విధేయ రామ' చిత్రంలో జోడీ కట్టిన సంగతి తెలిసిందే. త్వరలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. ​

ఇదీ చదవండి: 'మీ ప్రేమకు థాంక్స్​.. రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తా'​

Last Updated : Mar 12, 2021, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.