ETV Bharat / sitara

Sonu Sood IT Raid: 'సోనూసూద్ పన్ను ఎగవేతకు పాల్పడ్డారు'

సోనూసూద్‌ కార్యాలయాల్లో(Sonu Sood IT Survey) ఆదాయ పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజూ ఆయన నివాసానికి చేరుకున్న ఐటీ అధికారులు(Sonu Sood IT Raid).. పన్ను ఎగవేతను గుర్తించినట్లు తెలిపారు. విదేశీ నిధులను తీసుకోవడంలో 'విదేశీ విరాళాల నియంత్రణ చట్టం' నిబంధనలు ఉల్లంఘించినట్లు వెల్లడించారు.

sonusudh
సోనూసూద్​
author img

By

Published : Sep 17, 2021, 10:55 PM IST

బాలీవుడ్​ నటుడు సోనూసూద్​(Sonu Sood IT Survey) ఆస్తులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడోరోజు ఆయన నివాసానికి చేరుకున్న ఆదాయపు పన్నుశాఖ అధికారులు(Sonu Sood IT Raid).. ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఇందులో భాగంగా.. సోనూ 'ఫారెన్​ కంట్రిబ్యూషన్​ రెగ్యులేషన్​ యాక్ట్'(విదేశీ విరాళాల నియంత్రణ చట్టం)​ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపారు ఓ అధికారి. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

"ఈ సోదాల్లో.. సోనూ విదేశీ నిధులను తీసుకోవడంలో ఎఫ్​ఆర్​సీఏ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆధారాలు లభించాయి. పెద్ద మొత్తంలో విదేశీ నిధులను వేరే అవసరాల కోసం ఆయన ఖర్చు చేశారు. భారీ మొత్తంలో పన్ను ఎగవేతను అధికారులు గుర్తించారు. సోనూ వ్యక్తిగత ఆదాయంలో ఈ పన్ను ఎగవేతను గుర్తించాం. సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నాం. లెక్కల్లో లేని అనేక రసీదులను స్వాధీనం చేసుకున్నాం. బోగస్​ రుణాలు, బోగస్​ బిల్లింగ్స్​కు సంబంధించిన పత్రాలు ఆదాయపన్ను శాఖ అధీనంలో ఉన్నాయి. తప్పుడు ఖర్చులు చూపించి ఆయన పన్ను ఎగవేతకు పాల్పడ్డారు."

-అధికారి.

ఇటీవల సోనూసూద్‌.. దిల్లీ 'ఆప్‌ ప్రభుత్వం(Sonu Sood AAP Party) ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో తాజా ఐటీ సోదాలు చర్చనీయాంశమయ్యాయి.

సోనూ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కొవిడ్‌ వేళ వలస కూలీలతో పాటు ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తిపై కుట్రపూరితంగా ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి: Sonu sood Income tax: సోనూసూద్ నివాసాల్లో కొనసాగుతున్న సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.