'ఇస్మార్ట్ శంకర్'లో ఓ కొత్త స్టిల్ ఇప్పుడు టాలీవుడ్‌ని ఆకర్షిస్తోంది. రామ్.. తన కథానాయిక నభా నటేశ్ని భుజాలపై ఎక్కించుకున్న ఫొటో హాట్ హాట్‌గా ఉంది. రామ్ భలే ఎత్తేసుకున్నాడే - అంటూ ఆ చిత్రం చూసి మురిసిపోతున్నారు. ఎంతైనా హీరో కదా! కథానాయిక ఎంత బరువున్నా ఎత్తుకోవాల్సిందే.
కాకపోతే హీరోయిన్లని ఎత్తుకోవడం రామ్‌కి కొత్త కాదు. ఇంతకు ముందు `హలో గురు ప్రేమ కోసమే`సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ని కూడా ఇలానే ఎత్తుకున్నాడు. టైటిల్ సాంగ్‌లో.. అనుపమ హీరో చంకనెక్కింది. అంతకు ముందైతే `పండగ చేస్కో` సినిమా కోసం ఒకేసారి ఇద్దరు హీరోయిన్లని ఎత్తుకోవాల్సి వచ్చింది . అందులో రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ఇద్దరు హీరోయిన్లతో కలిసి ఓ పాటేసుకున్నాడు రామ్. అందులో ఇద్దరూ రామ్ చెరో వైపు ఎక్కేశారు. అలా.. రామ్‌కి హీరోయిన్లని ఎత్తుకోవడంలో మాంచి ప్రాక్టీస్ మొదలైంది. ఇక మీదట ఇలా హీరోయిన్లని ఎత్తుకోవడం ఈ హీరోకు సెంటిమెంట్‌గా మారిపోతుందేమో.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. 'ఐ హేట్ యు' స్పెల్లింగ్ తప్పంటున్నాడు..!