ETV Bharat / sitara

ఏడు రోజులకు రూ.70 లక్షల రెమ్యునరేషన్​! - Pawan kalyan new movie Update

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'వకీల్​ సాబ్​'. ఈ చిత్రంలో హీరోయిన్​గా నటించడానికి చిత్రబృందం శ్రుతి హాసన్​ను సంప్రదించగా.. ఏడు రోజులకు ఏకంగా రూ.70 లక్షల పారితోషకం ఆశించిందని సమాచారం.

Is Shruti Haasan charging Highest remuneration for per hour for Vakeel Saab?
ఏడు రోజులకు రూ.70 లక్షల రెమ్యూనరేషన్​!
author img

By

Published : Jun 16, 2020, 7:32 PM IST

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'వకీల్​ సాబ్​'. వేణు శ్రీరామ్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రకరణను త్వరలోనే పునః ప్రారంభించేందుకు చిత్రబృందం సమాలోచనలు చేస్తుందట. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్​ను పూర్తి చేసుకోగా.. పవన్​తోపాటు హీరోయిన్​పై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్​ పాత్ర కోసం శ్రుతి హాసన్​ను సంప్రదించగా.. అందుకు ఆమె అధికంగా పారితోషకాన్ని ఆశించిందని సమాచారం.

కేవలం ఏడు రోజుల షూటింగ్​కు గానూ శ్రుతి.. ఏకంగా రూ.70 లక్షలను రెమ్యునరేషన్​ అడిగినట్లు టాలీవుడ్​ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే శ్రుతిని ఈ ప్రాజెక్టులో హీరోయిన్​గా ఖరారు చేస్తున్నట్లు అధికార ప్రకటన వెలువడలేదు.

'వకీల్​ సాబ్​'లో హీరోయిన్​ పాత్ర కోసం గతంలో లావణ్య త్రిపాఠి, ఇలియానా, పూజా హెగ్డేలను చిత్రబృందం సంప్రదించినట్లు సమాచారం.

ఇదీ చూడండి... ఆదుకోమని సల్మాన్​ను ఆశ్రయించిన హీరోయిన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.