'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత హీరో ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివతో(NTR-Koratala Siva) ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లకుండానే అభిమానుల్లో భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడీ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత రానున్న సినిమా కాబట్టి.. పాన్ఇండియా లెవల్లో రూపొందించాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. ఇందుకోసం దాదాపు రూ.200కోట్లు ఖర్చు చేయనున్నారంటూ నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి కల్యాణ్‌రామ్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన కొమురంభీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదీ చూడండి: Koratala Birthday: హీరోయిజం లెక్కలు మార్చిన డైరెక్టర్