'దసరా వచ్చిందయ్యా... సరదా తెచ్చిందయ్యా... దశనే మార్చిందయ్యా.. జయహో దుర్గాభవానీ' అంటూ 'లారీ డైవ్రర్' సినిమాలో బాలకృష్ణ, విజయశాంతి అలరించారు. ఇప్పుడు అలానే విజయదశమికి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఈ పండగకు తీసుకురావాలని భావిస్తున్నారు. జులైలోనే విడుదల చేయాలనుకున్నా, కరోనా కారణంగా పరిస్థితి మారిపోయింది. దీంతో చిత్రబృందం ప్రణాళిక మార్చుకోవాల్చి వచ్చింది.
సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సెప్టెంబర్ కల్లా పూర్తి చేసుకొని, దసరాకు థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం కసరత్తులు చేస్తోంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. దీని తర్వాత దర్శకుడు బి.గోపాల్‌తో బాలయ్య కలిసి పనిచేయనున్నాడనే వార్తలు వినపిస్తున్నాయి.
ఇదీ చూడండి : కుమారుడి తాళానికి మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేస్తే