బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'అంగ్రేజీ మీడియం'. గురువారం (నేడు) ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 2018లో క్యాన్సర్ బారిన పడిన ఈ నటుడు విదేశాల్లో వైద్యం చేయించుకున్నాడు. తాజాగా అనారోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకకు హాజరుకాలేకపోతున్నాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నాడు ఇర్ఫాన్.
"అంగ్రేజీ మీడియం చిత్రం నాకు చాలా ప్రత్యేకమైంది. ఈ సినిమాలో ఎంత లీనమై నటించానో అదేవిధంగా ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని భావించా. కానీ, అనారోగ్యానికి గురై ట్రైలర్ విడుదల వేడుకకు దూరమవుతున్నా. చాలా బాధగా ఉంది. ఏదిఏమైనా నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటా. ఈ సినిమా అందరిలో నవ్వులు పూయిస్తుంది. ట్రైలర్ను ప్రతి ఒక్కరూ చూసి ఆనందించండి."
- ఇర్ఫాన్ ఖాన్, బాలీవుడ్ నటుడు
హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కరీనా కపూర్, రాధికా మదన్, పంకజ్ త్రిపాఠి, దీపక్ దోబ్రియల్, డింపుల్ కపాడియా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దినేశ్ విజన్ నిర్మాత. మార్చి 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
As we embark on the journey to release #AngreziMedium, here’s a small note for you allhttps://t.co/Sr0Pp1x3dv #AngreziMedium trailer out tomorrow!
— Irrfan (@irrfank) February 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">As we embark on the journey to release #AngreziMedium, here’s a small note for you allhttps://t.co/Sr0Pp1x3dv #AngreziMedium trailer out tomorrow!
— Irrfan (@irrfank) February 12, 2020As we embark on the journey to release #AngreziMedium, here’s a small note for you allhttps://t.co/Sr0Pp1x3dv #AngreziMedium trailer out tomorrow!
— Irrfan (@irrfank) February 12, 2020
ఇదీ చదవండి: ఒకే సినిమాలో నయన్ - సమంత..!