బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నాడు. గతేడాది కొన్నినెలల పాటు విదేశాల్లో చికిత్స తీసుకున్న ఈ హీరో... మరోసారి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం 'హిందీ మీడియం' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న 'అంగ్రేజీ మీడియం'లో నటిస్తున్నాడు. షూటింగ్ కోసం ఇటీవల లండన్ వెళ్లిన ఇర్ఫాన్... తాజాగా స్వదేశంలో అడుగుపెట్టాడు. ముంబయిలోని విమానాశ్రయంలో చక్రాలకుర్చీలో కూర్చొని కనిపించాడు.

అంగ్రేజీ మీడియం చిత్రీకరణ పూర్తయ్యాక... ఇర్ఫాన్‌కు శస్త్రచికిత్స జరిగినట్లు ఇర్ఫాన్ సన్నిహితుడు తెలిపాడు. ఇర్ఫాన్.. ఇంటిపై బెంగ పెట్టుకున్నాడని అందుకే ముంబయిలో కొన్ని రోజులు గడపాలనుకొంటున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో మీడియా ఎలాంటి పుకార్లు కల్పించకుండా మద్దతుగా ఉండాలని ఆయన కోరారు.
అంగ్రేజీ మీడియం పూర్తి...
అంగ్రేజీ మీడియంలో ఇర్ఫాన్‌తో పాటు కరీనా కపూర్, రాధికా మదన్, డింపుల్ కపాడియా కీలకపాత్రలు పోషించారు. ఇందులో ఇర్ఫాన్ చంపక్ అనే పాత్రలో నటిస్తున్నాడు. కరీనా పోలీసుగా, రాధికా మదన్ ఇర్ఫాన్‌కు కూతురుగా కనిపించనుంది. దినేశ్ విజన్ నిర్మాత. దీనితో పాటు 'గుడ్‌న్యూస్' అనే చిత్రంలోనూ సందడి చేయనున్నాడు ఇర్ఫాన్.
ఇదీ చదవండి...