ETV Bharat / sitara

ఈ బ్యాక్​డ్రాప్​తో మహేశ్-రాజమౌళి చిత్రం! - మహేశ్ బాబు, రాజమౌళి సినిమా కథ

'ఆర్ఆర్ఆర్' తర్వాత మహేశ్ బాబుతో ఓ సినిమా చేయనున్నారు రాజమౌళి. ఈ కాంబోపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రిన్స్​తో తెరకెక్కించే చిత్రం ఎలాంటి కథతో రూపొందుతుందో అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కాగా, దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది.

Interesting gossip on Mahesh Babu, Rajamouli Fim
ఈ బ్యాక్​డ్రాప్​తో మహేశ్-రాజమౌళి చిత్రం!
author img

By

Published : Feb 10, 2021, 7:25 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబుతో దర్శకధీరుడు రాజమౌళి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' పూర్తయిన తర్వాత ఈ సినిమాపై దృష్టిపెడతానని ఇప్పటికే వెల్లడించారు జక్కన్న. దర్శకధీరుడు తీసిన సినిమాల నేపథ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్​కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. దీంతో మహేశ్​తో భారీగా ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రాజమౌళి-మహేశ్ కాంబోలో తెరకెక్కే చిత్రం బ్యాక్​డ్రాప్​పై ఆసక్తి నెలకొంది.

మహేశ్​ సినిమాకు డిఫరెంట్​ లైన్​ తీసుకుని కథను సిద్ధం చేస్తున్నారట రచయిత విజయేంద్ర ప్రసాద్. ఇప్పటివరకు తెలుగులో కనిపించని బ్యాక్​డ్రాప్​ను ఇందులో చూపించనున్నారట. ఫారెస్ట్​ యాక్షన్ అడ్వెంచర్​గా ఈ సినిమాను రూపొందించనున్నారని సమాచారం.

ప్రస్తుతం మహేశ్​ బాబు 'సర్కారు వారి పాట' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. పరుశురామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.