ETV Bharat / sitara

ప్రభాస్‌ జాబితాలో మరో సినిమా..! - ప్రభాస్ సిద్ధార్ధ్ ఆనంద్

నిన్నమొన్నటి వరకు 'ఆదిపురుష్'​ సినిమా చిత్రీకరణతో బిజీబీజీగా గడిపిన ప్రభాస్​.. తదుపరి బాలీవుడ్​లో మరో మూవీ చేయనున్నారని సమాచారం. 'వార్​' సినిమా దర్శకుడు సిద్ధార్ధ్​ ఆనంద్​ ఇప్పటికే కథ సిద్ధం చేశారని.. దానిని 'డార్లింగ్​'కు వినిపించారని సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

prabhas, aadipurush movie
ప్రభాస్, ఆదిపురుష్​ సినిమా
author img

By

Published : Apr 17, 2021, 8:12 AM IST

ప్రభాస్‌ సినిమాల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు సినిమాల పనులతో బిజీగా ఉన్నారాయన. ఆ తర్వాత చేయనున్న చిత్రం గురించి బాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ప్రభాస్‌ కోసం 'వార్‌' దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ పూర్తిస్థాయిలో కథని సిద్ధం చేసి వినిపించారని, త్వరలోనే ఆ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని బాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

ఇదీ చదవండి: విశ్వక్ సేన్ కొత్త చిత్రం టైటిల్​ ఖరారు

మొన్నటిదాకా 'ఆదిపురుష్‌' సినిమా చిత్రీకరణతో ముంబయిలోనే గడిపారు ప్రభాస్‌. కరోనాతో అక్కడ ఆ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. శనివారం నుంచే హైదరాబాద్‌లో ఆరంభం కానున్న 'రాధేశ్యామ్‌' కొత్త షెడ్యూల్‌ కోసం రంగంలోకి దిగనున్నారు ప్రభాస్‌. కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, పాటనీ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.