ETV Bharat / sitara

COVID: ప్రముఖ సినీ నిర్మాత ర్యాన్‌ స్టీఫెన్‌ మృతి - మనోజ్ బాజ్​పేయ్

బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ కథానాయికగా నటించిన 'ఇందూ కి జవాని' సినిమా నిర్మాత ర్యాన్ స్టీఫెన్​.. కొవిడ్ సంబంధిత సమస్యలతో మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ర్యాన్​ను కోల్పోవడం దురదృష్టకరమంటూ కొంత మంది విచారం వ్యక్తం చేశారు.

Ryan Stephen, Indoo Ki Jawani producer
ర్యాన్​ స్టీఫెన్, ప్రముఖ నిర్మాత
author img

By

Published : May 29, 2021, 10:52 PM IST

కియారా అడ్వాణీ కథానాయికగా నటించిన 'ఇందూ కి జవాని' చిత్ర నిర్మాత ర్యాన్‌ స్టీఫెన్‌(50) కన్నుమూశారు. ఆయన కొవిడ్‌ సంబంధిత సమస్యల కారణంగా ఈ రోజు గోవాలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ప్రతిభావంతుడైన ర్యాన్‌ను కోల్పోవడం చాలా దురదృష్టకరం అంటూ పలువురు విచారం వ్యక్తం చేశారు.

ఎవరెవరు ఎమన్నారు..

  • బాలీవుడ్ నటి కియారా ఆయన మరణంపై స్పందిస్తూ.. "మా ప్రియమైన ర్యాన్‌ చాలా తొందరగా వెళ్లిపోయారు" అంటూ ఆవేదనగా తెలిపింది.
  • నటుడు మనోజ్‌ బాజ్‌పేయి.. "ఇదొక షాకింగ్ న్యూస్‌. ఇది నిజం కాదని అనుకుంటున్నా. నా స్నేహితుడు ర్యాన్‌ని ఎంతో మిస్ అవుతున్నా" అని చెప్పారు.
  • నటి దియా మీర్జా.. "ఇదొక హృదయ విదారకరమైన వార్త. నాకు తెలిసిన మంచి మనుషుల్లో ర్యాన్‌ ఒకరు" అంటూ ట్వీట్ చేశారు.

ర్యాన్ గతంలో జర్నలిస్ట్‌గా పనిచేశారు. ఆయన ధర్మ ప్రొడక్షన్స్ అసోసియేట్‌గా పనిచేశారు. ఎలక్ట్రిక్ యాపిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు. 2020లో హాస్యం నేపథ్యంగా కియారా అడ్వాణీ నటించిన 'ఇందూ కి జవాని' చిత్రాన్ని, 'దేవి' అనే లఘు చిత్రాన్ని నిర్మించారు.

ఇదీ చదవండి: ఇన్​స్టాలో కత్రినా కైఫ్ 50 మిలియన్ మార్క్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.