యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం 'రౌద్రం రణం రుధిరం' (ఆర్‌ఆర్‌ఆర్). రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబరు 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్ థీమ్ సాంగ్' పేరిట ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచే ఎవరు పాడుతున్నారా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. తాజాగా చిత్రబృందం ఈ వివరాల్ని తెలియజేస్తూ ఫొటోను విడుదల చేసింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటం వల్ల ఒక్కో భాషలో ఒక్కో ప్రముఖ గాయకుడితో ఈ పాటను పాడించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హేమచంద్ర, అనిరుధ్ రవిచందర్, విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, యాజిన్ నైజర్ ఆలపించిన ఈ పాట ఆగస్టు 1న ఉదయం 11గంటలకు విడుదల కానుంది. స్నేహం విలువని చాటిచెప్పే గీతమిది.
-
The First Song from #RRRMovie on August 1st, 11 AM.🔥🌊#Dosti
— DVV Entertainment (@DVVMovies) July 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
An @mmkeeravaani Musical.🎵
Sung by @itsvedhem.
Lyrics by #SirivennelaSitaramasastri garu. @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @DVVMovies @LahariMusic @TSeries @RRRMovie pic.twitter.com/oJTIgs9KwN
">The First Song from #RRRMovie on August 1st, 11 AM.🔥🌊#Dosti
— DVV Entertainment (@DVVMovies) July 27, 2021
An @mmkeeravaani Musical.🎵
Sung by @itsvedhem.
Lyrics by #SirivennelaSitaramasastri garu. @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @DVVMovies @LahariMusic @TSeries @RRRMovie pic.twitter.com/oJTIgs9KwNThe First Song from #RRRMovie on August 1st, 11 AM.🔥🌊#Dosti
— DVV Entertainment (@DVVMovies) July 27, 2021
An @mmkeeravaani Musical.🎵
Sung by @itsvedhem.
Lyrics by #SirivennelaSitaramasastri garu. @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @DVVMovies @LahariMusic @TSeries @RRRMovie pic.twitter.com/oJTIgs9KwN
ఈ సినిమాలో రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' పేరుతో వచ్చిన మేకింగ్ వీడియో అభిమానుల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతమందిస్తున్నారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: