పరిస్థితులు బాగుంటే ఇప్పటికే విడుదలై, ప్రేక్షకుల్ని అలరించి ఉండేది క్రేజీ మల్టీస్టారర్ చిత్రం 'RRR' (రౌద్రం రణం రుధిరం) (rrr movie). కొవిడ్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతోన్న సంగతి తెలిసిందే. విద్యార్థుల పరీక్షలకి సంబంధించి మార్చి పోతే సెప్టెంబరు అన్నట్టు ఈ సినిమా విషయంలో వేసవి పోతే అక్టోబరు అనుకున్నారంతా! ఈ వేసవిలో విడుదలకావాల్సి ఉండగా కరోనా, లాక్‌డౌన్ కారణంగా అక్టోబరు 13కి వాయిదా పడింది. పరిస్థితులు ఇంకా పూర్తిస్థాయిలో చక్కబడకపోవడం, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నామంటూ చిత్ర బృందం ప్రకటించడంతో అభిమానులకి నిరాశ ఎదురైంది. మళ్లీ ఎదురుచూపులు మొదలు!! మళ్లీ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్న వారికి తాజాగా ఆ శుభవార్తని వినిపించింది చిత్ర బృందం. జనవరి 7, 2022న 'RRR' (RRR release date)విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.
-
07.01.2022. It is !!!
— Ram Charan (@AlwaysRamCharan) October 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Get ready to experience India’s Biggest Action Drama in cinemas worldwide. #RRRMovie #RRROnJan7th @ssrajamouli @tarak9999 @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/V80QfIJ4Ff
">07.01.2022. It is !!!
— Ram Charan (@AlwaysRamCharan) October 2, 2021
Get ready to experience India’s Biggest Action Drama in cinemas worldwide. #RRRMovie #RRROnJan7th @ssrajamouli @tarak9999 @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/V80QfIJ4Ff07.01.2022. It is !!!
— Ram Charan (@AlwaysRamCharan) October 2, 2021
Get ready to experience India’s Biggest Action Drama in cinemas worldwide. #RRRMovie #RRROnJan7th @ssrajamouli @tarak9999 @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/V80QfIJ4Ff
దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో (RRR Budget) 'ఆర్ఆర్ఆర్' (RRR release date) నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR Movie Budget) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్(Ramcharan RRR New Look ), కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ (Ntr RRR Poster) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.