ETV Bharat / sitara

దేశాలు దాటిన ఈ ముద్దుగుమ్మల 'ప్రేమ'

author img

By

Published : Sep 10, 2020, 6:55 PM IST

మన దేశానికి చెందిన కొందరు హీరోయిన్లు.. విదేశీయుల్ని ప్రేమించి, ఆ బంధాన్ని వివాహం వరకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎంతో ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. వీరిలో ప్రియాంకా చోప్రా, శ్రియ, ప్రీతి జింతా తదితరులు ఉన్నారు.

indian heroins who are married to foreigners
దేశాలు దాటిన ఈ ముద్దుగుమ్మల ప్రేమ

పలానా హీరోయిన్ పెళ్లి అంటే చాలు.. ఎవరు అతడు? బ్యాక్​గ్రౌండ్​ ఏంటి? సినిమా నటుడా లేదంటే ఏ రంగానికి చెందినవాడు? అని అభిమానులు తెగ గుసగుసలాడుకుంటారు. అదే అతడు వేరే దేశానికి చెందిన వాడు అయితే ఆ టాపిక్​కు అంతే లేకుండా పోతుంది. అలా దేశాంతర వివాహాలు చేసుకున్న హీరోయిన్లు ఎవరు? ఎవర్ని పెళ్లి చేసుకున్నారు?. వంటి వివరాలు తెలుసుకుందాం.

ప్రియాంకా చోప్రా-నిక్ జోనస్

బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా.. తనకంటే దాదాపు పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్​ను పెళ్లాడింది. 2018 డిసెంబరులో జోద్​పుర్​లో వీరి వివాహం ఎంతో వేడుకగా జరిగింది. ఆ తర్వాత కూడా సోషల్​ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

priyanka chopra with nick jonas
భర్త నిక్ జోనస్​తో నటి ప్రియాంకా చోప్రా

ప్రీతి జింతా-జీన్

తన లాంగ్​టైమ్ బాయ్​ఫ్రెండ్ జీన్ గుడ్​ ఇనఫ్​ను 2016లో లాస్​ ఏంజెలిస్​లో వివాహం చేసుకుంది ప్రముఖ నటి ప్రీతి జింతా. తమ ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ, భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంటుంది.

priety zinta
భర్తతో నటి ప్రీతి జింతా

శ్రియా శరణ్-ఆండ్రూ కొశ్చివ్ ​

ఎప్పటి నుంచి ప్రేమలో ఉన్న నటి శ్రియ శరణ్.. రష్యాకు చెందిన ఆండ్రూ కొశ్చివ్​ను 2018లో ముంబయిలో పెళ్లి చేసుకుంది. అనంతరం ఉదయ్​పుర్​లో ప్రముఖుల కోసం పార్టీ కూడా ఇచ్చారు. భర్తతో ఆనందంగా ఉంటూ, అల్లరి చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలను తన ఇన్​స్టాలో పోస్ చేస్తూ ఉంటుందీ భామ.

shriya sharan
భర్త ఆండ్రూతో నటి శ్రియ శరణ్

రాధికా ఆప్టే-బెన్​డిక్ట్ టేలర్

ప్రముఖ సినీ నటి రాధికా ఆప్టే.. బ్రిటన్​కు చెందిన వయోలినిస్ట్ బెన్​డిక్ట్ టేలర్​ను 2012లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో తమ లాంగ్ డిస్టన్స్​ పెళ్లిని ఎలా మేనేజ్​ చేస్తున్నామో వెల్లడించింది.

radhika pte with her husband
భర్తతో నటి రాధికా ఆప్టే

సెలీనా జైట్లీ-పీటర్ హాగ్

హీరోయిన్​గానే కాక ప్రత్యేక గీతాలతోనబ ఆకట్టుకున్న నటి సెలీనా జైట్లీ.. 2011లో ఆస్ట్రియాకు చెందిన పీటర్​ హాగ్​ను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

celina jaitly
భర్త పీటర్​తో నటి సెలీనా జైట్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.