ETV Bharat / sitara

స్టార్​ నటీనటుల 'రియల్ టూ రీల్'​​ పేర్లు ఇవే.. - filmstars news names

పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు మనల్ని అందరూ గుర్తించేది పేరుతోనే. మరి అలాంటి పేరును మార్చుకోవడం కూడా ఓ ట్రెండ్​. తల్లిదండ్రులు పెట్టిన పేరు బాలేదనో, సంఖ్యాశాస్త్రం, లెక్కల ప్రకారం ఇంకొన్ని అక్షరాలు చేర్చుకుంటూనో ఎక్కువగా సెలబ్రిటీలు వార్తల్లో కనిపిస్తుంటారు. అలా రీల్ పేర్లతోనే వెండితెరపై రాణించడమే కాకుండా దాన్నే సొంతపేరుగా మార్చుకున్న కొందరి నటీనటులు జాబితా ఇదే..

indian filmstars name change
సన్నీలియోనీ, ఏఆర్​ రెహమాన్​ పేర్లు ఎలా మారాయంటే..?
author img

By

Published : Jun 29, 2020, 10:21 AM IST

ప్రతి ఒక్కరు తమ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు పెట్టిన పేరుతోనే ప్రఖ్యాతి చెందిన వారు కొందరైతే, పేరు మార్చుకుని అదృష్టం దక్కించుకున్న వారు మరికొందరు. సినీ పరిశ్రమలోనూ ఈ పోకడ కనిపిస్తుంది. ఏదో ఒక కారణం చేత తమ అసలు పేరు మార్చుకున్నవారు చాలా మందే ఉన్నారు. అలా సినీ పరిశ్రమలో రియల్​ నేమ్ కాకుండా రీల్​ నేమ్​తోనే ప్రసిద్ధి చెందిన వారిపై ఓ లుక్కేద్దాం.

రజనీకాంత్​..

తమిళనాట స్టార్​ హీరో, తలైవాగా పేరొందిన రజనీకాంత్​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విశేష ప్రజాదరణ, వినూత్నమైన స్ట్రైల్​ ఆయన సొంతం. రజనీకాంత్‌గా విశేషంగా పేరు సంపాదించుకున్న ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌. శివాజీ గణేశన్‌ లాగే తన పేరులో 'శివాజీ' ఉందని ఆయన సంతోషించేవారు. అయితే 'మూన్ర ముడిచ్చి' అనే తమిళ చిత్రంలో కె. బాలచందర్‌ ఆయనకు ముఖ్యపాత్ర ఇస్తూ పేరు మార్చారు. 'శివాజీ' పేరు నీకు ఇష్టమే కావచ్చు. కానీ, గందరగోళంగా ఉంటుంది. పేరు మారుస్తాను. ఇకపై నువ్వు రజనీకాంత్‌. నాకెందుకో అనాలనిపించింది. ఈ పేరుతో నువ్వు ఖ్యాతి తెచ్చుకుంటావు అని అలా నూతన నామకరణం చేశారు బాలచందర్‌.

indian filmstars name change
రజనీకాంత్​

చిరంజీవి..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరుకో చరిత్రుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా అరంగేట్రం చేసి సుప్రీం హీరో​ నుంచి మెగాస్టార్​గా ఎదిగిన చిరంజీవి ప్రతి ఒక్కరికి ఆదర్శం. అలాంటి చిరు అసలు పేరు శివ శంకర వరప్రసాద్. హనుమంతుడి భక్తురాలైన అమ్మ సూచన మేరకు పేరు మార్చుకున్నారు. చిరంజీవి అంటే 'చిరకాలం వర్ధిల్లు' అని అర్థం.

indian filmstars name change
చిరంజీవి

అమితాబ్​ బచ్చన్​..

హిందీ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్​, బిగ్ ​బచ్చన్​, బిగ్​బీ పేర్లతో మంచి ప్రతిష్ఠ సంపాదించుకున్న అమితాబ్​ అసలు పేరు ఇంక్విలాబ్​​ శ్రీవాత్సవ. 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదం​ నుంచి స్ఫూర్తి పొందిన బిగ్​బీ​ తల్లీదండ్రులు ఆయనకు ఆ పేరు పెట్టారు. ఇది స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బాగా మారుమోగిన స్లోగన్​.

indian filmstars name change
అమితాబ్​ బచ్చన్​..

సల్మాన్​ఖాన్​..

బాలీవుడ్​లో కండలవీరుడిగా, భాయ్​జాన్​గా పేరున్న స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​. ఆయన అసలు పేరు అబ్దుల్​ రషీద్​ సలీంఖాన్​. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. ఆయన తల్లిదండ్రులు సలీంఖాన్​- సల్మా ఖాన్​ పేర్లను కలిపి ఇలా కొత్త పేరు రీక్రియేట్​ చేసుకున్నారు.

indian filmstars name change
సల్మాన్​ ఖాన్​

అక్షయ్​ కుమార్​..

బాలీవుడ్​ ఖిలాడీ అక్షయ్​ కుమార్​ అసలు పేరు రాజీవ్​ భాటియా. చిత్ర పరిశ్రమలోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న నటీనటుల్లో ఒకరిగా ఈ స్టార్​ నటుడు దూసుకెళ్తున్నారు.

indian filmstars name change
అక్షయ్​ కుమార్​

అజయ్​ దేవగణ్​...

బాలీవుడ్​ సింగంగా పేరున్న అజయ్​ దేవగణ్ అసలు పేరు విశాల్​​ దేవగణ్​. ఇతడు నటుడు మాత్రమే కాదు దర్శకుడు, నిర్మాత కూడా. హిందీ పరిశ్రమలో తనకంటూ విభిన్నమైన స్టైల్​తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

indian filmstars name change
అజయ్​ దేవగణ్​...

జయమాలిని...

నాట్య తారగా విశేషఖ్యాతి తెచ్చుకున్న జయమాలిని అసలు పేరు అలమేలు. దర్శకుడు రామన్న 'నువ్వు బాగా నాట్యం నేర్చుకున్నావు. మంచి నాట్యకత్తెవి కావాలి. హేమమాలిని గొప్ప డ్యాన్సర్‌ కనుక, అంత మంచి మాలినిని తీసుకుని, జయ శబ్దం కలుపు. బాగుంటుంది' అని హితవు పలికి జయమాలినిగా పేరు మార్చారు.

indian filmstars name change
జయమాలిని...

సన్నిలియోనీ

బాలీవుడ్​ నటిగా, శృంగార తారగా పేరు తెచ్చుకున్న హీరోయిన్​ సన్నిలియోనీ. ఈ హీరోయిన్​ పేరు కరణ్​ జీత్​కౌర్. తొలిసారి సినిమాల్లోకి వచ్చినప్పుడు ఓ మ్యాగజైన్​ ఇంటర్వ్యూలో ఓ వింత ప్రశ్న ఎదురైంది. నచ్చిన పేరు చెప్పాలని ఎడిటర్​ అడగ్గా.. తన సోదరుడు సందీప్​ వోహ్ర అలియాస్​ సన్నీపేరు తనకు మదిలోకి వచ్చిందట. అదే పేరు ఫిక్స్​ చేసింది మ్యాగ్​జైన్​ సంస్థ. చివరన లియోనీ మాత్రం మ్యాగ్​జైన్​ ఎడిటర్లు జతచేర్చారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన అసలు పేరుతో ఓ వెబ్​సిరీస్​లోనూ నటించిందీ అందాల భామ. ఈమె ముద్దుపేరు మాత్రం 'గోగో'.

indian filmstars name change
సన్నీలియోనీ

మల్లికా షెరావత్​...

కాంట్రవర్సీ క్వీన్​, బోల్డ్​ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నటి మల్లికా షెరావత్​. అయితే ఈ అమ్మడు సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది. రీమా లాంబాగా పేరున్న ఈ డ్యాన్సింగ్​ గర్ల్​.. తన తల్లి పేరులోని షెరావత్​ను అలానే ఉంచుకొని ముందు పదం మార్చుకుంది. మల్లికా అంటే రూలర్​ అని అర్థం.

indian filmstars name change
మల్లికా షెరావత్​

ఏఆర్ రెహమాన్​..

భారత్​కు ఆస్కార్​ తెచ్చిన సంగీత దిగ్గజం ఏఆర్​ రెహమాన్​. విశ్వవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి గడించిన ఈయన అసలు పేరు దిలీప్ కుమార్. చెన్నైకి చెందిన సంగీత దర్శకుడు ఆర్​కే శేఖర్​(రాజగోపాల కులశేఖరన్​)- కరీమా బేగం ఈ సంగీతదర్శకుడి తల్లిదండ్రులు. తండ్రి చనిపోయాక నలుగురు పిల్లలను చూసుకోవడానికి తన తల్లి అవస్థలు పడేదట. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కుటుంబ పోషణ కోసం కొందరు సంగీత దర్శకుల వద్ద కీబోర్డ్​, పియానో​ వాయించేవారు రెహమాన్​. తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. వారి ఇంట్లో ఇస్లాం, క్రైస్తవ మతానికి సంబంధించిన ఫొటోలు ఉండేవి. తల్లి కస్తూరితో కలిసి ప్రశాంతత కోసం నెల్లూరు జిల్లాలోని సూఫీ ప్రవక్త కరీముల్లా షా ఖాద్రీ బోధనలు వినేందుకు వెళ్లేవారు. ఈ క్రమంలో ఖాద్రీ బోధనలకు ఆకర్షితులైన వీరి కుటుంబం తమకు అంతా మంచి జరగాలని, కష్టాలు తొలగిపోవాలని భావించి 1989లో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అయితే అంతకుముందే తన చెల్లెలు పెళ్లి నేపథ్యంలో ఓ జ్యోతిష్కుడిని కలిసిన సందర్భంలో తనకు దిలీప్ కుమార్ అనే పేరు నచ్చలేదని ముస్లిం పేరు సూచించాలని దిలీప్ కోరారట. ఆయన అబ్దుల్ రహీమ్‌గా కానీ, అబ్దుల్ రెహ్మాన్‌గా కానీ పేరు మార్చుకుంటే అంతా మంచే జరుగుతుందని సూచించారు. రెహ్మాన్ అనే పేరు నచ్చడం వల్ల మొదట తన పేరు రెహ్మాన్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత అల్లా రఖా(దేవుడు రక్షిస్తాడు) అని తన తల్లి మరో పేరును ముందు చేర్చగా.. ఏఆర్​ రెహమాన్​ అయ్యారు.​

indian filmstars name change
ఏఆర్​ రెహమాన్​

వీరే కాకుండా బాలీవుడ్​, టాలీవుడ్​, కోలీవుడ్​, మల్లూవుడ్​, శాండిల్​వుడ్​ నుంచి ఎందరో స్టార్​ నటీనటులు తమ పేర్లు మార్చుకుని.. రీల్​ నేమ్​తోనే ఆదరణ పొందారు.

హీరోలు...

భక్తవత్సల నాయుడు(మోహన్‌బాబు), కల్యాణ్​​ బాబు (పవన్​ కల్యాణ్​), భూపతి రాజు రవి శంకర్‌ రాజు(రవితేజ), ఘంటా నవీన్​ బాబు(నాని), ఉప్పు శోభనా చలపతిరావు(శోభన్​ బాబు), ఘట్టమనేని శివరామకృష్ణ(సూపర్ స్టార్ కృష్ణ), గద్దె వెంకట నారాయణ (రాజేంద్ర ప్రసాద్‌), శ్రీనివాస సర్జ(అర్జున్​), కెనడీ జాన్ విక్టర్​(విక్రమ్), శరవణన్ శివకుమార్(సూర్య), వెంకటేశ్​​ ప్రభు కస్తూరి రాజా(ధనుష్​), జంషెడ్​ సెతిరాకాత్​(ఆర్య), అమర్​ చౌదరి(జీవా), నవీన్​ కుమార్​ గౌడ(యశ్​), మహ్మద్ కుట్టీ ఇస్మాయిల్ పనిపరంబిల్​(మమ్ముట్టి)

హీరోయిన్లు...

డయానా మరియం కురియన్‌(నయనతార), విజయలక్ష్మి(రంభ), సుజాత(జయసుధ), లలిత రాణి(జయప్రద), విజయలక్ష్మి(సిల్క్‌ స్మిత), శ్రీలతా రెడ్డి(రోజా),శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్ప(శ్రీదేవి), జరీనా మొయిదు(నదియా), భైరవి(నమిత), రిషి బాల నావెల్​(సిమ్రాన్), బాలా త్రిపుర సుందరి(అంజలి), సుహాసిని (స్నేహ), మంత్ర(రాశీ), షమ్నా ఖాసిం(పూర్ణ).

ఇదీ చూడండి: అందం తరగని అమ్మలు.. ఆరోగ్యం పెంచుకున్న భామలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.