Godse gandhi movie: జాతిపిత మహత్మ గాంధీ మరణానికి కారణమైన నాథురాం గాడ్సే జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా 'వై ఐ కిల్డ్ గాంధీ'. గాంధీ వర్ధంతి రోజు అంటే జనవరి 30న ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు చిత్రాన్ని పూర్తిగా నిషేదించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.
"మన దేశంలో కనీస గౌరవానికి కూడా నాథురాం గాడ్సే అర్హుడు కాదు. ఈ సినిమాలో గాడ్సే పాత్ర పోషించిన వ్యక్తి పార్లమెంట్లో ఓ ఎంపీ. ఒకవేళ ఈ సినిమా విడుదలైతే మాత్రం దేశం మొత్తం దిగ్భ్రమ చెందుతుంది. అందుకే అన్ని సినిమా అసోసియేషన్ల తరఫున ఈ సినిమాను పూర్తిగా బ్యాన్ చేయాలని మేం కోరుతున్నాం" అని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
1948 జనవరి 30న గాంధీని గాడ్సే గన్తో కాల్చి చంపారు. ఈ నేపథ్యంగానే టవై ఐ కిల్డ్ గాంధీ' సినిమా తీశారు. జనవరి 30న లైమ్లైట్ ఓటీటీలో దీనిని రిలీజ్ కూడా చేయాలని ప్లాన్ చేశారు.
పలు పీరియాడికల్, చారిత్రక సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న మరాఠీ నటుడు అమోల్ కోల్హే ఈ సినిమాలో గాడ్సే పాత్ర పోషించారు. ఈయన ప్రస్తుతం ఎన్సీపీ తరఫున సిరుర్ పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: