ETV Bharat / sitara

ఆత్మహత్య చేసుకున్నానని అన్నారు: ఇలియానా - ఇలియానా అబార్షన్

తనపై వచ్చిన ఫేక్​ న్యూస్​ గురించి మాట్లాడింది నటి ఇలియానా. సూసైడ్ చేసుకుని చనిపోయాననే వార్తలు రాశారని చెప్పారు.

Ileana D'Cruz says there was fake news about her undergoing an abortion
ఇలియానా
author img

By

Published : May 2, 2021, 4:45 PM IST

అసత్య వార్తలకు తాను బాధితులరాలినేనని హీరోయిన్ ఇలియానా చెప్పింది. గర్భవతి అని, అబార్షన్​ చేయించుకున్నానని గతంలో తనపై వదంతులు వచ్చాయని వెల్లడించింది. ఇటీవల కాలంలో చనిపోయానంటూ కూడా వార్తలు వచ్చాయని ఈ నటి వెల్లడించింది.

"ఫేక్ న్యూస్​లు చాలానే వస్తున్నాయి. నేను గర్భవతి అని, కొన్నాళ్లకు అబార్షన్​ జరిగిందని వార్తలు వచ్చాయి. ఇది నిజంగా బాధాకరం. అలానే నేను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించానని, ఆ విషయాన్ని నా పనిమనిషి చెప్పిందని కూడా న్యూస్ వచ్చింది. ఇంతవరకు నాకు పనిమనిషే లేదు. ఇలాంటి అబద్ధాలను అసలు వార్తలుగా ఎలా రాస్తున్నారు?" అని ఇలియానా ఆవేదన వ్యక్తం చేసింది.

Ileana D'Cruz
ఇలియానా

తెలుగు సినిమా 'దేవదాసు'తో హీరోయిన్​గా పరిచయమైన ఇలియానా.. ఆ తర్వాత పోకిరి, కిక్ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. హిందీలోనూ కథానాయికగా పలు చిత్రాలు చేసింది. అభిషేక్ బచ్చన్ 'ద బిగ్​బుల్' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.