ఇలియానా కొన్నేళ్లుగా ప్రియుడు, ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో కలిసి ఉంటుంది. వీరిద్దరికీ పెళ్లయ్యిందన్న వార్తలు గతంలో హల్చల్ చేశాయి. ఇన్‌స్టా నుంచి ఇలియానా ఆండ్రూతో ఉన్న ఫొటోలను తొలింగించింది. వీరిద్దరూ ఒకర్నొకరు అన్‌ఫాలో అయ్యారు. ఈ విషయంతో బ్రేకప్ అంటూ వార్తలు గుప్పుమన్నాయి.
కొన్నాళ్ల క్రితం వీరి వివాహంపై ఇలియానాను ప్రశ్నించగా.. "ఈ విషయంపై నేను ఎలాంటి కామెంట్ చేయలేను. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉన్నా. మేమిద్దరం ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగానే ఉంచాలి అనుకుంటున్నా" అని చెప్పింది.
గతంలో ఇలియానా క్రిస్మస్ ట్రీని అలంకరిస్తున్న ఫొటో పోస్ట్ చేసి, "తీసింది మా వారే" అంటూ కామెంట్ పెట్టింది. ఈ హీరోయిన్ కోసం ఆండ్రూ పలుమార్లు ముంబయికి వచ్చాడు.
ప్రస్తుతం ఇలియానా 'పాగల్‌పంతి' సినిమాతో బిజీగా ఉంది. అనీజ్ బజ్మీ దర్శకుడు. నవంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదీ చూడండి: 'మహానటి' నుంచి 'మిస్ ఇండియా'గా కీర్తి సురేశ్